ఆదివారం శ్రీ 13 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
● ‘జిల్లాలోని ఓ మారుమూల మండలంలో పోస్టింగ్ వచ్చిన ఎంఎల్‌హెచ్‌పీ వరంగల్ నుంచి అప్ అండ్ డౌన్ చేసేందుకు అనువైన ప్రదేశం కోసం గతంలో వైద్యారోగ్యశాఖలో పనిచేసిన కొందరు ఉద్యోగులకు రూ.2లక్షల మేరకు ముట్టచెప్పి.. అనుకూల ప్రదేశంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు ఒకేసారి డిప్యుటేషన్లు రద్దు చేయడంతో సదరు ఎంఎల్‌హెచ్‌పీకి ఏం చేయాలో పాలుపోవడం లేదు. డబ్బులు పాయే...డిప్యూటేషన్ పాయే.. అని సహచర మిత్రుల ముందు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.’
● ‘మూడో ఏఎన్‌ఎంగా సొంత ఊరుకు దూరంగా పోస్టింగ్ వచ్చింది. ఇంటికి వెళ్లి రావడం ఇబ్బందిగా మారడంతో సదరు మహిళ వద్ద రూ.50వేలు తీసుకొని అనుకూలమైన పోస్టింగ్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఇప్పుడు డిప్యుటేషన్ రద్దు కావడంతో సదరు ఏఎన్‌ఎంకు ఏం చేయాలో అర్థం కావడం లేదు.’
సాక్షి, మహబూబాబాద్:
నూతన జిల్లా ఏర్పాటుతోపాటు, వైద్యారోగ్యశాఖలో చోటు చేసుకున్న పరిణామాలతో పల్లె దవాఖానాలు, హెల్త్ సెంటర్లు వెలిశాయి. ఇందుకు అనుగుణంగా వందలసంఖ్యలో ఎంఎల్‌హెచ్‌పీలు, మూడో ఏఎన్‌ఎంలు, ల్యాబ్ టెక్నీషియన్ల నియామకం జరిగింది. దీనికి తోడు ఉద్యోగులకు పదోన్నతులు కల్పించారు. కొన్ని చోట్ల కొత్తగా డాక్టర్లను నియమించారు. అయితే ఆయా నియామకాల్లో అవకతవకలు జరిగినట్లు నిర్ధారణ కూడా అయింది. అక్రమాలకు పాల్పడిన వైద్యారోగ్యశాఖ అధికారులు, ఉద్యోగులు అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చి అర్హులను విస్మరించినట్లు గత కలెక్టర్ శశాంక గుర్తించారు. దీంతో గతంలో నోటిఫికేషన్ వచ్చిన స్టాఫ్ నర్సుల నియామకం ఇప్పటికీ ముందుకు సాగలేదు. ఇందులో భాగంగానే కొందరు ఉద్యోగులు తమకు అనుకూలమైన ప్రదేశాల్లో పోస్టింగ్‌లు వేసుకునేందుకు లక్షల రూపాయలు ముడుపులు ఇచ్చినట్లు ప్రచారం. ఇందుకు గతంలో పనిచేసిన కొందరు జిల్లా వైద్యాధికారులు, యూనియన్ లీడర్లు, డీఎంహెచ్‌ఓకు సన్నిహితంగా ఉండే ఉద్యోగితోపాటు ఇక్కడ పనిచేసి ఇతర జిల్లాలకు బదిలీ అయిన మరికొందరు ఉద్యోగులు డిప్యుటేషన్ల కోసం లక్షల రూపాయలు ముడుపులు తీసుకున్నట్లు ప్రచారం. ఇలా జిల్లా వ్యాప్తంగా 150కి పైగా ఉద్యోగులు డిప్యుటేషన్‌పై వెళ్లినట్లు ప్రచారం. ఇక్కడ పనిచేసినంత కాలం మిమ్మల్ని కదిలించే వారే ఉండరని హామీ కూడా ఇచ్చినట్లు ఉద్యోగులు తమ సన్నిహితులతో చెబుతున్నారు. గత డీఎంహెచ్‌ఓ ఉన్నంత వరకు అంతా సవ్యంగా సాగగా.. కొ త్త డీఎంహెచ్‌ఓ రాగానే కొత్త చిక్కు వచ్చింది. వచ్చీ రాగానే డిప్యూటేషన్ల రద్దు చేయడం, ఈ విషయం కలెక్టర్ వరకు వెళ్లిన సదరు అధికారి కూడా ఆగ్రహం వ్యక్తం చేయడంతో... ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. డబ్బులు పాయె. డిప్యుటేషన్ పాయె.. అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
న్యూస్‌రీల్
పైరవీలకోసం పరుగులు..
గత రెండు, మూడు సంవత్సరాల నుంచి గుట్టుచప్పుడు కాకుండా సాగిన వైద్యారోగ్యశాఖలోని ఉద్యోగుల డిప్యుటేషన్‌పై ఒక్కసారిగా అధికారులు కొరడా ఝులిపించారు. దీంతో డిప్యుటేషన్‌పై వెళ్లిన వారిలో కొందరు మధర్ పోస్టింగ్‌కు వెళ్లేందుకు వెనకడుగు వేస్తున్నారు. అక్కడికి వెళ్తే తమ ప్రైవేట్ ప్రాక్టీస్‌కు ఇబ్బంది అవుతుందని కొందరు, సొంత ఇంటికి దూరమవుతామని మరికొందరు, అప్ అండ్ డౌన్ చేసేందుకు ఇబ్బంది అవుతుందని ఇంకొందరు సతమతం అవుతున్నారు. తమ డిప్యుటేషన్లు కొనసాగించాలని తమకున్న పరిచయాలతో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్‌లోని అధికారుల ద్వారా, సీఎం సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, మంత్రి సీతక్క, ఆరోగ్య మంత్రి దామోదర రాజన ర్సింహ, ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ వద్దకు వెళ్లి తమ ఇబ్బందులు చెబుతూ.. డిప్యుటేషన్ కొనసాగించాలని కోరుతున్నట్లు తెలిసింది. ఈ పరిస్థితిలో సదరు అధికారులు, ప్రజాప్రతినిధులు తమ అనుచరుల కోసం డిప్యుటేషన్ల కొనసాగింపుపై జిల్లా అధికారులపై ఒత్తిడి తెస్తారా.. ఒత్తిడి వస్తే కలెక్టర్, కొత్తగా వచ్చిన డీఎంహెచ్‌ఓ ఎలా స్పందిస్తారో..అనేది జిల్లాలో చర్చగా మారింది.
డిప్యుటేషన్ల రద్దుతో ఉద్యోగుల ఆగమాగం
గతంలో చేతులు మారిన లక్షలపై చర్చ
కొనసాగింపుపై రాజకీయ ఒత్తిళ్లు
ససేమిరా అంటున్న ఉన్నతాధికారులు
జిల్లాలో 150 మంది
డిప్యుటేషన్ ఉద్యోగులు
ఆదివారం శ్రీ 13 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025


