శ్రీపాదరావు ఆశయ సాధనకు కృషి
కాటారం: మంథని నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల అభివృద్ధికి నిరంతరం పరితపించిన దివంగత మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు ఆశయ సాధనకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్ర మల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. శ్రీపాదరావు వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలోని చింతకాని క్రాస్ వద్ద గల ఆయన విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బీఎల్‌ఎం గార్డెన్స్‌లో పుష్పగిరి ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి అద్దాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మంథని నియోజకవర్గంలో వైద్య, విద్య, రవాణాలాంటి మౌలిక వసతులు అందుబాటులోకి తీసుకురావడానికి శ్రీపాదరావు కృషి చేశారన్నారు. తన తండ్రి శ్రీపాదరావు స్ఫూర్తితో పేదల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తున్నామన్నారు. కార్యక్రమంలో కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు కటుకం మృత్యంజయం, ‘సూడా’ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు వేమునూరి ప్రభాకర్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అద్యక్షుడు చీమల సందీప్, మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, దండ్రు రమేశ్, బాన్సోడ రాణిబాయి పాల్గొన్నారు.
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు


