అర్ధశతాబ్దపు ‘అపూర్వ’ కలయిక
హన్మకొండ చౌరస్తా : ఐదు దశాబ్దాల క్రితం వారందరూ విద్యార్థులు. నేడు పిల్లలు, మనుమలు, మ నుమరాళ్లతో జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. వాటన్నింటినీ మరిచిపోయి ఆదివారం మళ్లీ విద్యార్థులుగా మారి రోజంతా సంతోషంగా జరుపుకున్నారు. అందుకు లష్కర్‌బజార్‌లోని ఎల్‌బీహెచ్‌ఎస్ వేదికగా నిలిచింది. 1974–75లో ఎల్‌బీహెచ్‌ఎస్‌లో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థుల అపూర్వ కలయిక రిటైర్డ్ ఎస్సై జి.నర్సయ్య ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ రోజంతా ఉత్సాహంగా గడిపారు. నాటి గురువుల పాండురంగాచారి, ఐలయ్య, పాఠశాల ప్రస్తుత హెచ్‌ఎంలు జగన్, వెంకటేశంను స న్మానించారు. కాగా, సమ్మేళనంలో నెల్లూరు, కాకినా డ, హైరాబాద్, మంచిర్యాల, కరీంనగర్, ఏటూరునాగారం, ములుగు ప్రాంతాల్లో స్థిరపడిన వారంద రూ కలుసుకున్నారు. పరిటాల సుబ్బారావు, సత్యసుబ్రహ్మణ్యం, రమేశ్, తదితరులు పాల్గొన్నారు.


