ఇల్లందలో గుడిసె దగ్ధం
వర్ధన్నపేట: ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని గుడిసె దగ్ధమైన సంఘటన ఆదివారం మండలంలోని ఇల్లంద గ్రామంలో జరిగింది. స్థానికులు, బాధితుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కడెం రాజు, ఆయన తండ్రి మల్లయ్య గుడిసె వేసుకుని పాత ఇనుప సామాను కొనుగోలు, అమ్మకంతోపాటు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగి స్తున్నారు. ఆదివారం రాజు భార్య దేవుడికి దీపం వెలిగించి తాగునీరు తీసుకురావడానికి బయటకు వెళ్లింది. ఇంతలో దీంపం మంటలు అంటుకుని చెలరేగి గుడిసె లోపల ఉన్న బట్టలు, బియ్యం, దాచుకున్న డబ్బులు రూ.15 వేలు కాలిపోయాయి. గ్రామస్తులు బిందెలతో నీళ్లు పోసి మంటలను ఆర్పివేశారు. రాజు కుటుంబానికి ప్రభుత్వం సహా యం అందించాలని స్థానికులు కోరారు.
దమ్మన్నపేటలో విద్యుదాఘాతంతోఇల్లు..
రేగొండ: విద్యుదాఘాతంతో ఇల్లు దగ్ధమైన ఘటన మండలంలోని దమ్మన్నపేట గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం..బండి అశోక్‌తో పాటు కుటుంబ సభ్యులు ఉదయం పొ లం పనులకు వెళ్లారు. ఇంటి నుంచి పొగ, మంటలు రావడాన్ని గమనించిన స్థానికులు పరకాల అగ్ని మాపక సిబ్బందికి సమాచారం చేరవేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది స్థానికుల సాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.అప్పటికే నష్టం జరిగిపోయింది. ప్రమాదంలో సుమారు రూ. 3లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
రోడ్డు ప్రమాదంలో
ముగ్గురికి గాయాలు
వాజేడు: మండల పరిధిలోని పావిరాల వాగు సమీపంలో జాతీయ రహదారిపై ఎదురెదురుగా రెండు బైక్‌లు ఢీకొనడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. బాధితుల కథనం ప్రకారం.. వెంకటాపురం(కె) మండల పరిధిలోని వీరభద్రారం గ్రామానికి చెందిన రామ్‌చరణ్, సంజయ్ వాజేడు వైపు నుంచి జాతర వైపునకు వెళ్తున్నారు. అదే సమయంలో కదేకల్ గ్రామానికి చెందిన మనోజ్ జాతర వైపు నుంచి కడేకల్‌కు వస్తున్నాడు. ఈ క్రమంలో ఎదురెదురుగా రెండు బైక్‌లు ఢీకొన్నాయి. దీంతో ముగ్గురికి గాయాలు కాగా స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలను సేకరించి చికిత్స నిమిత్తం ముగ్గురిని వైద్యశాలకు తరలించారు.


