రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
నర్సింహులపేట: రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, రైతు పండించిన ప్రతీ గింజను కొనుగోలు చేస్తామని ప్రభుత్వ విప్ జాటోత్ రాంచంద్రునాయక్ అన్నారు. మండలంలోని ముంగిమడుగు, వంతడపల గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపీ బలరాంనాయక్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలతో పాటు, సన్నవడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని అన్నారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలోనే రైతులు, పేదలు సంతోషంగా ఉంటున్నారని అన్నారు. ధాన్యం దళా రులకు అమ్మి మోసపోవద్దని రైతులను కోరారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ మెరుగు సత్యనారాయణ, జినుకుల రమేశ్, చిర్ర సతీష్‌గౌడ్, రామకృష్ణ, శ్రీకాంత్, యాదగిరి, శ్రీనువాస్, యాకయ్య, సొమిరెడ్డి, సురేశ్, మహబూబుఖాన్, మధుకర్‌రెడ్డి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.


