నేడు అంబేడ్కర్ జయంతి ఉత్సవాలు
మహబూబాబాద్ అర్బన్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 134వ జయంతి ఉత్సవాలు సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి ఎం. నర్సింహరావు ఆదివారం తెలిపారు. ఉదయం 9 గంటలకు అంబేడ్కర్ విగ్రహానికి ముఖ్య అతిథులు మంత్రి సీతక్క, ఎంపీ పోరిక బలరాంనాయక్, ప్రభుత్వ విప్ జాటోత్ రాంచందర్‌నాయక్, మానుకోట ఎమ్మెల్యే మురళీనాయక్, కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, అదనపు కలెక్టర్లు లెనిన్‌వత్సల్ టొప్పో, వీరబ్రహ్మచారి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారని పేర్కొన్నారు. అనంతరం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్‌లో సమావేశం ఉంటుందని, అంబేడ్కర్ జయంతి ఉత్సవాలకు అన్ని కుల, ప్రజా సంఘాల నాయకులు హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.
గంజాయి పట్టివేత
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ పట్టణ శివారులోని బాబునాయక్ తండా సమీపంలో ఇద్దరు యువకులు గంజాయి తాగేందుకు ప్రయత్నిస్తుండగా తమకు వచ్చిన విశ్వసనీయ సమాచారంతో వారిని అదుపులోకి తీసుకున్నామని టౌన్ సీఐ పెండ్యాల దేవేందర్ ఆదివారం తెలిపారు. బాబునాయక్ తండా ప్రాంతంలో కొందరు యువకులు గంజాయి సేవిస్తున్నట్లు సమాచారం వచ్చిందన్నారు. ఈ క్రమంలో టౌన్ ఎస్సై బి.విజయ్ కుమార్ అక్కడకు చేరుకుని తనిఖీలు చేయగా ఇద్దరు యువకులు సిగరెట్లలో గంజాయి పొడి పోసుకుని తాగేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించారన్నారు. వారిని అదుపులోకి తీసుకుని 28.50 గ్రాముల గంజాయి, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారని తెలిపారు. ఎస్సై విజయ్ కుమార్ ఫిర్యాదు చేయగా మరో టౌన్ ఎస్సై కె.శివ కేసు నమోదు చేశారని తెలిపారు.
పోరాటాలతోనే ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం
తొర్రూరు: పోరాటాలతోనే ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం సాధ్యమని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మురళీకృష్ణ అన్నారు. టీఎస్ యూటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం ఆదివారం డివిజన్ కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో నిర్వహించారు. సంఘ సీనియర్ నాయకురాలు కొండబత్తుల రాధాదేవి సంఘ జెండాను ఆవిష్కరించారు. మురళీకృష్ణ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల హక్కుల సాధన, విద్యా రంగాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా కోశాధికారి నాగమల్లయ్య, నాయకులు చైతన్య, రాయలు, వనజ, సుల్తానా బేగం, మౌనిక, మమత, స్రవంతి, పల్లవి పాల్గొన్నారు.
సేంద్రియ ఆహారం
తీసుకోవాలి
హన్మకొండ చౌరస్తా: సేంద్రియ పద్ధతిలో పండించిన వాటిని తినాలని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్ అన్నారు. హనుమకొండ పబ్లిక్ గార్డెన్‌లోని నేరెళ్ల వేణుమాధవ్ కళాప్రాంగణంలో గ్రామ భారతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రకృతి గ్రామీణ ఉత్పత్తుల సంతను ఆదివారం బండా ప్రకాశ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత జంక్‌ఫుడ్‌కు అలవాటు పడి అనేక వ్యాధులు కొని తెచ్చుకుంటోందన్నారు. జంక్‌ఫుడ్, రసాయనాలతో కూడిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. తెలంగాణ గ్రామ భారతి అధ్యక్షురాలు సూర్యకళ మాట్లాడుతూ ప్రజల్లో మార్పు తీసుకురావాలన్న సదుద్దేశంతో ప్రతీ నెల ప్రకృతి సంత నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సామాజికవేత్త నిమ్మల శ్రీనివాస్, సంస్థ వరంగల్ జిల్లా బాధ్యుడు అజిత్‌రెడ్డి, తోట ఆనందం, అనిత, బయ్య సారయ్య తదితరులు పాల్గొన్నారు.
నేడు అంబేడ్కర్ జయంతి ఉత్సవాలు
నేడు అంబేడ్కర్ జయంతి ఉత్సవాలు


