భూభారతితో రైతులందరికీ మేలు
మహబూబాబాద్ రూరల్ : సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి పోర్టల్ ద్వారా రైతులందరికీ మేలు జరుగుతుందని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నా రు. సోమవారం రాత్రి భూభారతి పోర్టల్ ప్రారంభం సందర్భంగా హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని మానుకోట రైతు వేదికలో ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ ద్వారా ఎమ్మెల్యే మురళీనాయక్, వ్యవసాయ అధికారులు, రైతులు వీక్షించారు. అన ంతరం ఎమ్మెల్యే మురళీనాయక్ మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ ద్వారా రైతులు, సాధారణ ప్రజలకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ధరణిని రద్దుచేసి భూభారతి పోర్టల్ తీసుకొచ్చిందని తెలిపారు. ఏడీఏ అజ్మీర శ్రీనివాసరావు, ఏఓ నారెడ్డి తిరుపతిరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ దేశెట్టి మల్లయ్య, కాంగ్రెస్ నేతలు దేవరం ప్రకాశ్‌రెడ్డి, రాంరెడ్డి, ఎడ్ల రమే శ్, ఖలీల్, అజ్మీరా సురేశ్, కోడి శ్రీను, బుజ్జి వెంకన్న, పూజారి వెంకన్న, రైతులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్
మానుకోట రైతు వేదికలో
సీఎం ప్రసంగం వీక్షణం


