అగ్నిప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి
మహబూబాబాద్: అగ్ని ప్రమాదాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ విప్ జాటో త్ రాంచంద్రునాయక్, ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. అగ్ని మాపకశాఖ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ నెల 14నుంచి 20వ తేదీ వరకు వారోత్సవాల్లో భాగంగా నిర్వహించే అవగాహన కార్యక్రమాలను ప్రజలు వీక్షించాలన్నారు. ప్రమాదాలపై ఉన్న సందేహాలను నివృత్తి చేసుకోవాలన్నారు. జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనాథ్ మాట్లాడుతూ.. అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజ లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. సిబ్బంది కృష్ణ, రవీందర్, వెంకన్న, చందర్, గోపి, విశ్వనాథ్, జీవన్, రవి ఉన్నారు.
రావి ఆకుపై అంబేడ్కర్ చిత్రం
కేసముద్రం: భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఇనుగుర్తి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని కె.అమూల్య అంబేడ్కర్ చిత్రాన్ని రావి ఆకుపై చిత్రీకరించింది. అలాగే సుద్దముక్కపై అంబేడ్కర్ అని ఆంగ్ల అక్షరాలను చెక్కింది. ఈ మేరకు సూక్ష్మకళను ప్రదర్శించిన విద్యార్థినిని ఉపాధ్యాయ బృందం సోమవారం అభినందించింది. అదే విధంగా ‘అందరివాడు అంబేడ్కర్’అనే అంశంపై ఈనెల 8న నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో అమూల్య ప్రథమ స్థానంలో నిలిచినట్లు ప్రిన్సిపాల్ జయశ్రీ తెలిపారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యేలు భూక్య మురళీనాయక్, రాంచంద్రునాయక్ చేతుల మీదుగా అమూల్య ప్రశంసపత్రం అందుకున్నట్లు తెలిపారు.
సభను విజయవంతం చేయాలి
గంగారం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలో ఈనెల 17న ఎస్టీ తెగల వర్గీకరణ కోసం నిర్వహించనున్న సభను విజయవంతం చేయాలని తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు సువర్ణపాక వెంకటరత్నం అన్నారు. సోమవారం మండలంలోని మడగూడెం గ్రామంలో చలో ఇల్లెందు వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. కత్తి రమేశ్, యాప లక్ష్మణ్‌రావు, ఈసం నర్సింహారావు, మోకాల సత్యం, యాప సందయ్య, యాప వీరలక్ష్మి, ఈసం గౌరయ్య పాల్గొన్నారు.
ఎస్‌ఎఫ్‌ఓ సస్పెన్షన్
మహబూబాబాద్: జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక శాఖ జిల్లా కార్యాలయంలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న డి.నాగేశ్వర్‌రావును సస్పెండ్ చేస్తూ సోమవారం రీజినల్ ఫైర్ ఆఫీసర్ ఉత్తర్వులు జారీ చేశారు. నాగేశ్వర్‌రావు అధికార దుర్వినియోగం చేశారని, మరిపెడ మండలంలో ఓ పరిశ్రమకు ఫేక్ ఎన్‌ఓసీ ఇచ్చారని, ఇలా పలు కారణాలతో ఈ నెల 11న సస్పెండ్ చేసినట్లు సిబ్బంది తెలిపారు. ఆయన ఇచ్చిన ఎన్‌ఓసీలపై ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేసి తదుపరి చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు.
ఆర్చరీ అసోసియేషన్ సభ్యుడిగా శంకరయ్య
మహబూబాబాద్ అర్బన్: దేశంలో ఆర్చరీ క్రీడాభివృద్ధికి కోసం ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈమేరకు మానుకోట జిల్లా వాసి పుట్ట శంకరయ్య కమిటీ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా కమిటీ సభ్యులు దేశవ్యాప్తంగా పర్యటనలు చేసి ఆర్చరీ అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటారు. పుట్ట శంకరయ్య ఏఏఐ సభ్యుడిగా ఎన్నిక కావడంపై ఉమ్మడి జిల్లా ఆర్చరీ సంఘం అధ్యక్షుడు సాదుల సారంగపాణి, ఖమ్మం జిల్లా యువజన క్రీడల అధికారి సునీల్ రెడ్డి, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి కృష్ణాపర్‌బాబు హర్షం వ్యక్తం చేశారు.
అగ్నిప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి


