రూ.53.28 లక్షల విలువైన గంజాయి పట్టివేత
కురవి: రూ.53.28 లక్షల విలువైన 106 కిలోల 960 గ్రాముల ఎండు గంజాయి పట్టుకుని నలుగురిని అరెస్ట్ చేసినట్లు మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు తెలిపారు. ఈ మేరకు సోమవారం కురవి పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆదివారం మండల కేంద్రంలోని ఓం ఫంక్షన్ హాల్ ఎదుట ఎస్సారెస్పీ కెనాల్ వద్ద ఎస్సై గండ్రాతి సతీశ్ వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఒడిశాకు చెందిన ఓ కారు కనిపించడంతో అనుమానం వచ్చి తనిఖీ చేయగా గంజాయి లభించింది. దీంతో మరిపెడ మండలం తండా ధర్మారంకు చెందిన బానోత్ మహేందర్, ఒడిశాకు చెందిన నర్సింగ్ మడి, రామచంద్ర మడి, మాడ్కమి చంద్రను అదుపులోకి తీసుకుని విచారించగా గంజాయి తరలిస్తున్నట్లు ఒప్పుకోవడంతో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలి పారు. ఎండు గంజాయి పట్టుకున్న ఎస్సై సతీశ్, సిబ్బందికి రివార్డులు అందజేశారు. కాగా, నిందితులు ఒడిశాలోని చిత్రకొండ వద్ద ఎండు గంజాయి కొనుగోలు చేసి కారులో ఏపీలోని విశాఖపట్టణం నుంచి ఖమ్మం మీదుగా మరిపెడ వెళ్లేందుకు కురవి వైపునకు వచ్చి పోలీసులకు పట్టుబడ్డారు.
నలుగురు అరెస్ట్
వివరాలు వెల్లడించిన మానుకోట డీఎస్పీ


