● జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జస్టిస్ ఇందిర
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: మానసిక దివ్యాంగులు, వారి తల్లిదండ్రులకు ఉచిత న్యాయ సంబంధమైన సేవలు అందిస్తామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి డి.ఇందిర అన్నారు. బుధవారం స్థానిక టీచర్స్‌కాలనీలోని బ్రహ్మ మానసిక దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇలాంటి వారికి ఆరోగ్యపరమైన చికిత్సలు ఎంతో అవసరమన్నారు. మానసిక దివ్యాంగుల కోసం 24 ఏళ్లుగా ప్రత్యేక పాఠశాలను నిర్వహిస్తున్న గన్నోజు చంద్రశేఖర్‌ను అభినందించారు. మున్సిపల్ మాజీ చైర్మన్ ఎ.ఆనంద్ కుమార్‌గౌడ్ మాట్లాడుతూ మానసిక దివ్యాంగుల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం వెన్నంటి ఉంటుందన్నారు. ఇలాంటి చిన్నారులు, పెద్దలను బుద్ధిమంతులుగా తీర్చిదిద్దడం ఒక మహాయజ్ఞమని పేర్కొన్నారు. కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ కార్యదర్శి బి.సునీత, సభ్యులు ఆనంద్, మహదేవ్, పాఠశాల ప్రిన్సిపాల్ సుజాత, మాజీ సైనికుడు ఎం.ఆర్.కె.రెడ్డి, వైద్యులు డా.ప్రణతి, డా.నమిత, డా.స్వాతి తదితరులు పాల్గొన్నారు.
మన్యంకొండ హుండీ ఆదాయం రూ.35.26 లక్షలు
మహబూబ్‌నగర్ రూరల్: మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం ఈ ఏడాది బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం రెండోసారి హుండీ లెక్కించారు. మొత్తం రూ.రూ.35,26,085 ఆదాయం వచ్చింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన హుండీ లెక్కింపు రాత్రి 7 గంటలకు సాగింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్‌కుమార్, అళహరి రామకృష్ణ, ఈఓ శ్రీనివాసరాజు, సహాయ కమిషనర్ మదనేశ్వర్, సూపరింటెండెంట్ నిత్యానందచారి, ఐడీబీఐ బ్యాంకు మేనేజర్ నీలకంఠ, పాలక మండలి సభ్యులు సుధా, మంజుల తదితరులు పాల్గొన్నారు.
బీచుపల్లి హుండీ ఆదాయం రూ.35.69 లక్షలు
ఎర్రవల్లి: బీచుపల్లి ఆంజనేయస్వామి ఆలయ హుండీ లెక్కింపును బుధవారం నిర్వహించారు. మొత్తం 8 నెలల 8 రోజులకు చెందిన హుండీ ఆదాయాన్ని లెక్కించగా.. ఇందులో కరెన్సీ ద్వారా రూ.34,09,845, నాణెముల ద్వారా రూ.1,59,440 మొత్తం ఆదాయం 35,69,285 వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి రామన్‌గౌడ్ పేర్కొన్నారు. గద్వాల డివిజన్ దేవాదాయ దర్మాదాయ శాఖ పరిశీలకురాలు వెంకటేశ్వరి ఆధ్వర్యంలో లెక్కింపు నిర్వహించారు. గద్వాల యూనియన్ బ్యాంకు సిబ్బంది, గద్వాల, వనపర్తి, కొత్తకోటకు చెందిన సేవా సమితి సభ్యులతోపాటు బ్యాంకు సిబ్బంది రవికుమార్, ప్రమోద్, ఆలయ సిబ్బంది, అర్చకులు, సేవా సమితి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
బంగారం, వెండి ఆభరణాలు చోరీ
చారకొండ: బంగారు, వెండి ఆభరణాలు చోరీ అయిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ శంషోద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన కొంపెల్లి సరిత రోజువారిగా తన ఇంటికి తాళం వేసి తాళచెవిని పక్కన పెట్టి బయటకు వెళ్లింది. గమనించిన గుర్తుతెలియని వ్యక్తులు తాళం తీసి ఇంట్లోకి ప్రవేశించి 13 గ్రాముల బంగారు ఆభరణాలు, 30 తులాల వెండి గొలుసులు, రూ.15 వేల నగదును ఎత్తుకెళ్లారు. తాళం చెవిని యథాస్థానంలో పెట్టారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఉచిత న్యాయ సేవలు అందిస్తాం
ఉచిత న్యాయ సేవలు అందిస్తాం