పాన్‌గల్: మండలంలోని తెల్లరాళ్లపల్లితండా సమీపంలో ఉన్న కేఎల్‌ఐ పస్పుల బ్రాంచ్ కెనాల్ డీ–1 కాల్వకు మంగళవారం గండి పడి పొలాల మీదుగా ప్రవహించడంతో పాటు చివరి ఆయకట్టుకు సాగునీరు అందని పరిస్థితి నెలకొంది. కాల్వ పర్యవేక్షణను ఇరిగేషన్ అధికారులు విస్మరించడంతో జమ్ము పేరుకుపోయిందని.. నీరు ముందుకు పారక చివరి ఆయకట్టుకు సాగునీరు అందని పరిస్థితి నెలకొందని తెల్లరాళ్లపల్లి, తెల్లరాళ్లపల్లితండా రైతులు వాపోతున్నారు. కాల్వ తెగి సాగునీరు వృథా అవుతుంటే తమ పరిధి కాదంటూ నాగర్‌కర్నూల్, వనపర్తి ఇరిగేషన్ అధికారులు తప్పించుకుంటున్నారే తప్ప సమస్యను పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా స్పందించి మరమ్మతు చేసి చివరి ఆయకట్టుకు సాగునీరు సాఫీగా చేరేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు. సమస్యను వనపర్తి ఇరిగేషన్ ఈఈ మధుసూదన్‌రావు వద్ద ప్రస్తావించగా.. ఆ కాల్వ మరమ్మతు నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలోకి వస్తుందన్నారు.