రామలింగేశ్వరస్వామికి విశేషాలంకరణ
అడ్డాకుల మండలంలోని కందూర్ సమీపంలో స్వయంభూగా వెలసిన శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో శివలింగానికి ఆదివారం విశేషాలంకరణ చేశారు. అర్చకులు వివిధ రకాల పూలతో గర్భగుడిని, శివలింగాన్ని శోభాయమానంగా అలంకరించి పూజలు చేశారు. ఉగాది పండుగ కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రధాన ఆలయంలోని శివలింగాన్ని దర్శించుకున్న భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించారు. తర్వాత ఆలయ ఆవరణలో ఉన్న కల్పవృక్షం చుట్టు ప్రదక్షిణలు చేశారు. ఆలయం బయట ఉన్న దుకాణాల వద్ద రద్దీ కనిపించింది.
– అడ్డాకుల


