పరిశోధనకు పట్టం | - | Sakshi
Sakshi News home page

పరిశోధనకు పట్టం

Apr 1 2025 12:45 PM | Updated on Apr 1 2025 3:15 PM

పరిశోధనకు పట్టం

పరిశోధనకు పట్టం

జడ్చర్ల డిగ్రీ కళాశాల వృక్షశాస్త్రం విద్యార్థులకు అరుదైన గౌరవం

రాష్ట్రంలోనే ప్రథమం..

డిగ్రీ కళాశాల స్థాయి విద్యార్థులు చేసిన పరిశోధన రాష్ట్రంలోనే ప్రథమం కావడం విశేషం. రాష్ట్రంలో ఉస్మానియా, కాకతీయ, మహాత్మాగాంధీ, శాతవాహన, తెలంగాణ, పాలమూరు, హైదరాబాద్‌ మొత్తం 7 యూనివర్సిటీలు ఉండగా.. ఏ ఒక్క యూనివర్సిటీలోనూ డిగ్రీ స్థాయిలో ఇలాంటి పరిశోధనలు జరగలేదంటే అతిశయోక్తి లేదు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ యూనివర్సిటీ, ఎన్వరాన్‌మెంట్‌ ప్రొటెక్షన్‌ ట్రైనింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇనిసిట్యూట్‌ (ఈపీటీఆర్‌ఐ)లలో మాత్రమే చెట్లు కార్బన్‌ డయాకై ్సడ్‌ తీసుకునే దానిపై పరిశోధనలు జరిగాయి. అయితే రెండు చోట్ల డా.సదాశివయ్య శిష్యులే పరిశోధనలు చేయడం గమనార్హం.

జడ్చర్ల టౌన్‌: మొక్కలు కార్బన్‌ డయాకై ్సడ్‌ ఎంత గ్రహిస్తాయనే అంశంపై జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల పరిశోధనలకు అరుదైన గౌరవం లభించింది. రాష్ట్రస్థాయిలో కమిషనరేట్‌ ఆఫ్‌ కాలేజ్‌ ఎడ్యుకేషన్‌ (సీసీఈ) నిర్వహించే జిజ్ఞాసలో వృక్షశాస్త్ర విభాగం విద్యార్థులకు తృతీయ స్థానం దక్కింది. రాష్ట్రంలోని 134 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల నుంచి 13 విభాగాల్లో 16 అంశాలపై పోటీలు నిర్వహించగా.. జిజ్ఞాసకు జడ్చర్ల కళాశాల నుంచి వివిధ విభాగాల నుంచి 5 అంశాలు పంపించారు. సీసీఈ జిజ్ఞాస ఫలితాలు గతనెల మూడవ వారంలో విడుదల చేయగా.. జడ్చర్ల డిగ్రీ కళాశాల వృక్షశాస్త్ర విద్యార్థులు తృతీయ స్థానంలో నిలిచారు. ఏప్రిల్‌ 9న హైదరాబాద్‌ రూసా కార్యాలయంలో జరిగే వేడుకల్లో ప్రదానంచేసే అవార్డును డా.సదాశివయ్య బృందం స్వీకరించనుంది.

జిజ్ఞాస లక్ష్యం..

డిగ్రీ కళాశాలల్లో విద్యార్థులను చదువుతో పాటు పరిశోధనల వైపు మళ్లించడం.. వారిచే నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టేందుకు గాను కమిషనరేట్‌ ఆఫ్‌ కాలేజ్‌ ఎడ్యుకేషన్‌ 2016–17లో జిజ్ఞాసను ప్రారంభించింది. ఒక్కో విభాగంలో పరిశోధన చేసే అంశం కోసం ఐదుగురు విద్యార్థులు, ఒక మెంటర్‌ (అధ్యాపకుడు) ఉంటారు. రాష్ట్రంలోని 134 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో రూపొందించిన అంశాలను నేరుగా సీసీఈకి పంపిస్తున్నారు. అలా పంపించిన అంశాలను రూసా కార్యాలయంలో ప్రదర్శించే అవకాశం కల్పిస్తున్నారు.

ఆరు నెలలపాటు పరిశోధనలు..

చెట్లు కార్బన్‌ డైయాకై ్సడ్‌ గ్రహిస్తాయని అందరికీ తెలిసిందే. అయితే అవి ఎంత గ్రహిస్తాయని మాత్రం తెలియదు. ఈ విషయం తెలుసుకుందామని వృక్షశాస్త్ర అధ్యాపకుడు డా. సదాశివయ్య ఆధ్వర్యంలో ఆ విభాగం విద్యార్థులు రవీందర్‌, ఇందు, మేఘన, శివసాయి, సహిస్త ఆజ్మి ఆరు నెలలపాటు పరిశోధనలు చేశారు. కళాశాల బొటానికల్‌ గార్డెన్‌లో ఉన్న 105 జాతులకు చెందిన 1,228 చెట్లపై వారు పరిశోధనలు జరిపారు. చెట్టు ఎత్తు, కాండం కొలతలతో వాటి సాంద్రత విలువలు కనుక్కుని, ఒక్కొక్క చెట్టు ఎంత కార్బన్‌ డయాకై ్సడ్‌ తీసుకుంటుందో లెక్కగట్టారు. గార్డెన్‌లో 6వేలకు పైగా మొక్కలు, చెట్లు ఉండగా.. 1,228 చెట్లు ఒక్కొక్కటి 30 సెం.మీ. కన్నా ఎక్కువ చుట్టు కొలత ఉన్నవి గుర్తించారు. ఈ చెట్లు ఏడాదికి 282 టన్నుల కార్బన్‌ డయాకై ్సడ్‌ తీసుకుంటాయని ప్రాజెక్ట్‌ ద్వారా వెల్లడైంది. ఇదే అంశాన్ని వీడియో, ఆడియో రూపంలో పంపగా తృతీయస్థానం దక్కింది.

మొక్కలు కార్బన్‌ డయాకై ్సడ్‌ ఎంత గ్రహిస్తాయనే అంశంపై పరిశోధన

బొటానికల్‌ గార్డెన్‌లో 1,228 చెట్లపై ఆరు నెలలపాటు రీసెర్చ్‌

విద్యార్థుల జిజ్ఞాసకు దక్కిన

తృతీయ స్థానం

9న హైదరాబాద్‌లో అవార్డు స్వీకరణ

పరిశోధన ప్రయోజనాలు..

సాధారణంగా ఏగిస, నారేపి, రావి, మర్రి, మామిడి వంటి చెట్లు కార్బన్‌ డయాకై ్సడ్‌ ఎక్కువగా తీసుకుంటాయని తేలడంతో.. వాటిని కాలుష్య ప్రాంతాల్లో ఎక్కువగా పెంచేలా ప్రభుత్వం సిఫార్సులు చేయవచ్చు. దీనివల్ల వాతావరణ కాలుష్యం తగ్గే అవకాశాలు పెరుగుతాయి. కళాశాలలోని 1.228 చెట్లు 282 టన్నుల కార్బన్‌ డయాకై ్సడ్‌ స్వీకరిస్తున్నందున.. వాటికి కాలుష్య పరిశ్రమలు ఏడాదికి రూ. 5లక్షలు చెల్లించాల్సి వస్తుందని తేలింది. భవిష్యత్‌లో జడ్చర్ల కళాశాల బొటానికల్‌ గార్డెన్‌కు ఈ రూపంలో భారీగా ఆదాయం సమకూరనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement