రాములోరి బ్రహ్మోత్సవాలకు సిద్ధం
ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామ నవమిని పురస్కరించుకొని ఈనెల 3న నుంచి 8వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ మేనేజర్ సురేందర్‌రాజు మంగళవారం తెలిపారు. ఆరు రోజుల పాటు నిర్వహించనున్న ఉత్సవాల్లో భాగంగా 3న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, అంకురార్పణ, 4న ధ్వజారోహణం, లక్ష్మీహయగ్రీవ హోమం, 5న ధన్వంతరీ హోమం, సుదర్శన హోమం, 6న సీతారాముల కల్యాణోత్సవం, రథోత్సవం, 7న సామ్రాజ్య పట్టాభిషేకం, ఐశ్వర్యప్రాప్తి, మహాలక్ష్మీ హోమం, 8న చక్రస్నానం, మహా పూర్ణాహుతి, పుష్పయాగం, ధ్వజారోహణం వంటి కార్యక్రమాలతో ఉత్సవాలు ముగియనున్నట్లు తెలిపారు. కావునా భక్తులు అధిక సంఖ్యలో ఉత్సవాలకు హాజరై కనులారా తిలకించి స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని ఆయన కోరారు.
● 3న తిరుమంజన సేవతో ప్రారంభం
● 6న సీతారాముల కల్యాణం
● 7న సామ్రాజ్య పట్టాభిషేకం
రాములోరి బ్రహ్మోత్సవాలకు సిద్ధం
రాములోరి బ్రహ్మోత్సవాలకు సిద్ధం


