ఎదురుచూపులే.. | - | Sakshi
Sakshi News home page

ఎదురుచూపులే..

Apr 4 2025 12:24 AM | Updated on Apr 4 2025 12:24 AM

ఎదురు

ఎదురుచూపులే..

అద్దె వాహనదారులకు అందని బిల్లులు

ఇళ్లకు పోలేకుపోతున్నాం..

నెలల తరబడి బిల్లులు రాలేకపోవడంతో ఇళ్లకు పోలేకపోతున్నాం. అఽధికారులను ఎన్ని సార్లు కలిసినా బిల్లులు చేశామని చెబుతున్నారే తప్ప బిల్లులు మాత్రం రావడం లేదు. రెండు మూడు నెలలంటే ఏమో కాని 12, 15 నెలల నుంచి బిల్లులు రాకుంటే ఎట్ల బతకాలి. ఉన్నతాధికారులు చొరవ చూపి జిల్లా వ్యాప్తంగా ఉన్న బిల్లులను వెంటనే చేయించాలి.

– అబ్దుల్‌ ఖాదర్‌, జిల్లా అధ్యక్షుడు,

ఫోర్‌ వీలర్స్‌ డ్రైవర్స్‌ హైర్‌ వెహికిల్స్‌

అసోసియేషన్‌, మహబూబ్‌నగర్‌

వినతిపత్రాలు ఇచ్చినా

ప్రయోజనం లేదు

బిల్లులు చెల్లించాలని ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినా ప్రయోజనం లేకుండాపోయింది. రెండేళ్ల నుంచి బిల్లులు రాకుంటే బతికేది ఎలా.

– సయ్యద్‌ సలీం హుసేనీ, కార్యవర్గ సభ్యుడు, మహబూబ్‌నగర్‌

దుర్భర జీవితాన్ని

అనుభవిస్తున్నాం

పెండింగ్‌లో ఉన్న బిల్లులు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలి. బిల్లులు నెల నెల రాకపోవడంతో వాహనాలు నడిపిచేందుకు అప్పులు చేస్తున్నాం. నెలల తరబడి వాహనాలకు చెందిన బిల్లులు రాకపోవడంతో దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నాం.

–ధర్మానాయక్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి

34 నెలలుగా పెండింగ్‌...

నా వాహనానికి చెందిన 34 నెలల నుంచి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఒక్క నెల బిల్లు రాకపోతేనే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏకంగా 34 నెలలుగా బిల్లులు రాకపోతే మేము ఎలా జీవించాలి. అధికారులు స్పందించి నా తోపాటు పెండింగ్‌లో ఉన్న వాహనదారులు బిల్లులను వెంటనే చెల్లించాలి.

– నిరంజన్‌, వాహనదారుడు

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): వివిధ ప్రభుత్వ శాఖల్లో నడుస్తున్న అద్దె వాహనదారులకు బిల్లుల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. ఈ ఆర్థిక సంవత్సరం పూర్తి కావడంతో తమకు బిల్లులు రావేమోననే ఆందోళన అద్దె వాహనదారుల్లో నెలకొంది. 12 నెలలుగా వారికి రావాల్సిన బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో వారు ఆర్థికంగా నలిగిపోతున్నారు. బిల్లులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

అద్దె వాహనాలను సమకూర్చుకోవాలి..

మండల స్థాయి నుంచి ఆపై స్థాయి అధికారులకు ప్రభుత్వం వాహన సౌకర్యం కల్పిస్తోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అద్దె వాహనాలను సమకూర్చుకోవాలి. దీంతో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ప్రభుత్వం ప్రతి నెలా ఒక్కో వాహనానికి రూ.33 వేలు చెల్లిస్తుంది. ఇదిలా ఉండగా చాలా మంది అధికారులు అద్దె వాహనాల స్థానంలో తమ సొంత వాహనాలను వాడుకుంటూ అడ్డదారిలో బిల్లులు నొక్కేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అలా చేయడం ద్వారా ఎంతో యువత ఉపాధిని కోల్పోతున్నారు. కొందరికే ప్రభుత్వ అధికారుల వద్ద వాహనాలు పెట్టుకునే అవకాశం దొరుకుతోంది. వారికి సైతం బిల్లులు సకాలంలో రావడం లేదు.

సొంత పనులకు ఈ వాహనాలే దిక్కు..

కేవలం ప్రభుత్వ కార్యకలాపాలకు మాత్రమే ఉపయోగించాల్సిన వాహనాలను కొంత మంది అధికారులు సొంత పనులకు సైతం వాడుతున్నారని వాహనదారులు వాపోతున్నారు. ఇది ఏమిటని ప్రశ్నించలేని పరిస్థితి నెలకొందని, ప్రశ్నిస్తే తమ వాహనాలను తొలగిస్తారేమోనని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం వాహనదారులకు సుమారుగా రూ. 40 లక్షల దాకా బిల్లులు రావాల్సి ఉంది. బిల్లులు చెల్లించాలని ఇటీవల పంచాయతీ రాజ్‌, గ్రామీణాబివృద్ధి శాఖ డైరెక్టర్‌ సృజనను కలిసి వినతిపత్రం సమర్పించారు.

రూ.40 లక్షలకు పైగా పెండింగ్‌

ఇబ్బందులు పడుతున్న

వాహన యజమానులు

సొంత వాహనాలను వాడుతున్న పలువురు అధికారులు

ఉపాధి కోల్పోతున్న యువత

ఎన్నో నెలల నుంచి పెండింగ్‌..

నిబంధనల ప్రకారం నిరుద్యోగులు ఆయా సంక్షేమ శాఖల ద్వారా కొనుగోలు చేసే వాహనాలను ప్రభుత్వ అధికారుల వద్ద అద్దెకు పెట్టుకోవాలి. ఇలా జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో మండల, డివిజన్‌, జిల్లా అధికారుల వద్ద దాదాపు 150 వరకు వాహనాలు నడుస్తున్నాయి. వాటికి సంబంధించి 15 నెలలుగా బిల్లులు రావడం లేదని వాహనాల యజమానులు చెబుతున్నారు.

జిల్లాకు సంబంధించి రూ.40 లక్షలకు పైగా ఉన్న బకాయిలు విడుదల కావాల్సి ఉంది. డీఆర్‌డీఓ శాఖలో 26 నెలలు, సమాచార పౌర సరఫరాల శాఖ 9 నెలలు, మత్స్య శాఖ 4 నెలలు, గిరిజన సంక్షేమ శాఖ 24 నెలల నుంచి, జిల్లా పరిశ్రమల 5 నెలలు, ఆర్‌అండ్‌బీ 12 నెలలు, ఇరిగేషన్‌ 10 నెలలు, హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ 10 నెలలు, ఎస్సీ అభివృద్ధి శాఖలో ఏకంగా 34 నెలలు, మిషన్‌భగీరథ (ఇంట్రా) లో 16నెలల నుంచి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో పాటు వివిద ప్రభుత్వ శాఖల్లో కూడా నెలల తరబడి బిల్లులు రాక అద్దెవాహనదారులు ఇబ్బందులు పతున్నారు.

16 నెలలుగా పెండింగ్‌లో బిల్లులు...

నా వాహనం మిషన్‌ భగీరథ శాఖలో నడుస్తుంది. 16 నెలలకు చెందిన బిల్లులు రావాల్సి ఉంది. ఏమిటని ప్రశ్నిస్తే ఏం చేసుకుంటారోచేసుకోండని అధికారులు తేల్చి చెబుతున్నారు. మీరు కాకుంటే వేరే వాళ్ల వాహనం పెట్టుకుంటామని బెదిరిస్తున్నారు.

– చెన్నయ్య, వాహనదారుడు

ఎదురుచూపులే.. 1
1/6

ఎదురుచూపులే..

ఎదురుచూపులే.. 2
2/6

ఎదురుచూపులే..

ఎదురుచూపులే.. 3
3/6

ఎదురుచూపులే..

ఎదురుచూపులే.. 4
4/6

ఎదురుచూపులే..

ఎదురుచూపులే.. 5
5/6

ఎదురుచూపులే..

ఎదురుచూపులే.. 6
6/6

ఎదురుచూపులే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement