ఖిల్లాఘనపురం: మండలంలోని మామిడిమాడ శివారులో జరుగుతున్న ఫిల్టర్ ఇసుక తయారీ ప్రదేశాన్ని తహసీల్దార్ సుగుణ, పంచాయతీరాజ్ ఏఈ రమేష్‌నాయుడు పోలీసులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ అక్రమంగా ఫిల్టర్ ఇసుక తయారు చేసి విక్రయిస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. మామిడిమాడ శివారులోని నేరెడు చెరువులో పెద్ద ఎత్తున ఫిల్టర్ ఇసుక దందా జరిగినట్లు అక్కడి పరిస్థితులను చూస్తే తెలుస్తుందని తెలిపారు.
అధికారుల హెచ్చరికలు బేఖాతర్
డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలకు ఫిల్టర్ ఇసుక ఉపయోగిస్తున్నట్లు సమాచారం రావడంతో తహసీ ల్దార్, పీఆర్ ఏఈ రమేష్‌నాయుడు అక్కడికి వెళ్లి పరిశీలించారు. అది ఫిల్టర్ ఇసుకగా గుర్తించి దానిని ఇళ్ల నిర్మాణాలకు ఉపయోగించరాదని అక్కడ నిర్మాణాలు చేస్తున్న వారిని ఆదేశించారు. అధికారులు అ క్కడి నుంచి వెళ్లిన కొంతసేపటికే యథావిధిగా ఫి ల్టర్ ఇసుకతోనే ఇళ్ల నిర్మాణాలు సాయంత్రం వరకు కొనసాగించారు. ఈ విషయమై పీఆర్ ఏఈ రమేష్‌నాయుడును వివరణ కోరగా ఫిల్టర్ ఇసుకతో నిర్మాణాలు చేపట్టొదని సూచించామని, వారు అలాగే ని ర్మాణాలు చేపడితే ఎంబీ చేయకుండా నిలిపివేస్తామన్నారు.


