స్థానికంగా ఉన్న 20 ఎకరాల ప్రభుత్వ సీలింగ్ భూమిని పరిశీలించిన కలెక్టర్.. అక్కడ ఆలయాలకు వచ్చే వాహనాల పార్కింగ్‌తోపాటు భక్తుల వసతుల కల్పన కోసం, పబ్లిక్ టాయిలెట్లు, సమాచార కేంద్రంగా మార్చాలని, స్థలంలో అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టి, పచ్చదనాన్ని పెంపొందించాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. ఆలయ పరిసరాల్లో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేయాలని మున్సిపల్ కమిషనర్‌కు చెప్పారు. అనంతరం సంగమేశ్వర ఆలయాన్ని సందర్శించి పరిసరాల్లో పచ్చదనాన్ని పెంచాలని, మొక్కల సంరక్షణ కోసం నీటి సరఫరాపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి దేవస్థాన ప్రవేశ ద్వారాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలన్నారు. భక్తులు పరిశుభ్రమైన వాతావరణంలో దైవదర్శనం చేసుకునేలా, స్థానిక వీధుల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టి, పార్కింగ్ నిర్వహణ సక్రమంగా ఉండేలా చూసుకోవాలన్నారు. అనంతరం పాపనాశనం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్ నాగేశ్వర్‌రెడ్డి, దేవాదాయ శాఖ రీజినల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణ, ఆర్కిటెక్టు సూర్యనారాయణమూర్తి, శ్రీలేఖ, కేంద్ర పురావస్తు శాఖ అధికారి రోహిణి పాండే, ఆర్కియాలజీ ఏడీ నాగలక్ష్మి, ఈఓ పురేందర్, డీపీఓ నాగేంద్రం, తహసీల్దార్లు ప్రభాకర్, మంజుల, ఇరిగేషన్ ఈఈ శ్రీనివాస్, ఆర్‌అండ్‌బీ ఈఈ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
అలంపూర్: దక్షిణకాశీ అలంపూర్‌ను మరింత సుందరంగా తీర్చిదిద్ది.. పర్యాటకపరంగా అభివృద్ధి చేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. శుక్రవారం అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ్‌రావు, ఆలయ కమిటీ సభ్యులతో కలిసి అలంపూర్ ఆలయాలను సందర్శించారు. పరిసరాలు, పర్యాటకరంగంగా చేయాల్సిన అభివృద్ధి, భక్తులకు సౌకర్యాలు, వసతి కల్పన తదితర అంశాలపై కూలంకుషంగా చర్చించారు. జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి దేవస్థానానికి దిశానిర్దేశంగా జాతీయ రహదారి నుంచి ఏర్పాటు చేసిన సూచిక బోర్డులను ఆయన పరిశీలించారు. జాతీయ రహదారిపై గల ఇటిక్యాలపాడు, మానవపాడు, అలంపూర్ క్రాస్‌రోడ్ల వద్ద ఏర్పాటు చేసిన సూచిక బోర్డులను పరిశీలించి.. వాటి ఎత్తును పెంచడంతోపాటు, బోర్డులను ఆకర్షణీయంగా, సృజనాత్మకంగా రూపకల్పన చేయాలని సూచించారు. హైదరాబాద్ నుంచి ఎర్రవల్లి, ఎర్రవల్లి నుంచి అలంపూర్ మార్గంలోని కీలక ప్రదేశాల్లో సూచిక బోర్డులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆయా బోర్డుల్లో అలంపూర్ చరిత్ర, ఆలయ విశిష్టతను తెలియజేసే విధంగా చిత్రలేఖనాలు, ఆలయ సంస్కృతి ప్రతిబింబించేలా బొమ్మలు గీయించాలన్నారు. అలంపూర్ అండర్‌పాస్ ఫ్‌లైవర్‌ను పరిశీలించారు. ఆలయానికి వచ్చే భక్తులకు మార్గంలోనే ఆధ్యాత్మిక భావన వచ్చేలా ప్రధాన కూడళ్లలో ఆకర్షణీయమైన చిత్రాలను ఏర్పాటు చేయాలన్నారు. అలంపూర్ రైల్వే గేట్ వద్ద నిర్మాణంలో ఉన్న ఆలయ ఆర్చిని పరిశీలించి త్వరగా పనులు పూర్తి చేయాలన్నారు.
20 ఎకరాల్లో పార్కింగ్..
జోగుళాంబ ఆలయంలో భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు కృషి
20 ఎకరాల్లో పార్కింగ్, ఇతర
వసతుల ఏర్పాటుకు చర్యలు
ఆలయ విశిష్టత, చరిత్ర తెలియచేసే విధంగా చిత్రాలు
గద్వాల కలెక్టర్ బీఎం సంతోష్ వెల్లడి


