శ్రీరామా.. నీ నామం ఎంతో రుచిరా
గద్వాల టౌన్: పుస్తకాల్లో రామకోటి రాయాలంటేనే ఎంతో ఓపిక కావాలి.. కానీ, జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రానికి చెందిన భక్తురాలు ఇల్లూరి శ్రీలక్ష్మి బియ్యపు గింజలపై శ్రీనామనామం రాస్తూ రికార్డు సృష్టిస్తున్నారు. పట్టణంలోని వెంకటరమణ కాలనీకి చెందిన ఇల్లూరి శ్రీలక్ష్మి 15,116 బియ్యపు గింజలపై జెల్ పెన్నుతో ‘శ్రీరామ’ అనే అక్షరాలు రాశారు. ఈ బియ్యపు గింజలలో అయోధ్యకు 5 వేలు, భద్రాచలానికి 3 వేలు, బీచుపల్లికి 5 వేలు, స్థానికంగా రామాలయాలకు 2 వేల బియ్యపు గింజలు అందజేశారు. రామనామం జపిస్తూ భక్తితో రాసిన ఈ బియ్యపు గింజలను ఆయా ఆలయాల్లో జరిగే ఉత్సవాలకు అక్షింతలుగా పంపినట్లు పేర్కొన్నారు. 2015 నుంచి శ్రీరామ నామాలు రాస్తూ శ్రీరామ నవమి వేడుకలకు తలంబ్రాలుగా అందిస్తున్నారు. ఈమె గతంలోనూ మహాశివరాత్రి సందర్భంగా కూడా బియ్యపు గింజలపై ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రం రాసి భక్తిని చాటుకున్నారు. ఇల్లూరి శ్రీలక్ష్మి భక్తిని జిల్లా ప్రజలు ప్రశంసిస్తున్నారు.
15,116 బియ్యపు
గింజలపై రామనామం
అయోధ్య, భద్రాచలం ఉత్సావాలకు అక్షింతలు
శ్రీరామా.. నీ నామం ఎంతో రుచిరా


