ఈద్‌మిలాప్‌తో సోదరభావం పెంపు
స్టేషన్ మహబూబ్‌నగర్: ఈద్‌మిలాప్‌లతో సోదరభావం పెంపొందుతుందని టీజీఎంఎఫ్‌సీ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ అన్నారు. జమాతే ఇస్లామి హింద్ మహబూబ్‌నగర్ ఆధ్వర్యంలో స్థానిక అల్మాస్ ఫంక్షన్‌హాల్‌లో శనివారం రాత్రి ఘనంగా ఈద్‌మిలాప్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కొత్వాల్ మాట్లాడుతూ ఈద్‌మిలాప్ కార్యక్రమం మనలోని ఐక్యతను చాటుతుందన్నారు. రంజాన్ ఈదుల్ ఫితర్ పండుగ తర్వాత ఈద్‌మిలాప్ నిర్వహిస్తుండడం ఆనవాయితీగా వస్తోందన్నారు. జమాతే ఇస్లామి హింద్ ఆధ్వర్యంలో గత కొన్నేళ్ల నుంచి ఈద్‌మిలాప్ నిర్వహిస్తుండడం అభినందనీయమన్నారు. ఎంపీజే తెలంగాణ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, మౌలానా అబ్దుల్ నాసర్ మజహరి తదితరులు ప్రసంచి ఈద్‌మిలాప్ ప్రాముఖ్యతను వివరించారు.


