ప్రెషర్ తక్కువగా వస్తుంది..
మా వీధికి నాలుగుగైదు రోజులకోసారి మిషన్ భగీరథ పథ కం ద్వారా తాగునీరు వదులుతున్నారు. ఈ ప్రాంతం ఎత్తుగా ఉన్నందున ప్రెషర్ తక్కువగా వస్తుండటంతో సరపోవడం లేదు. సీడబ్ల్యూసీ గోదాం చౌర స్తా నుంచి బోయపల్లి రోడ్డులో కొన్ని చోట్ల నల్లాలకు ఆన్‌ఆఫ్ లేకపోవడంతో వృథాగా పోతోంది. ఇక్కడి మెకానిక్ షాపు వద్ద పైపు లీకేజీ ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.
– కిశోర్‌కుమార్, మోతీనగర్
రోడ్డు వెంట వృథా అవుతోంది
మా కాలనీలోని మ హేంద్రనగర్ వైపు వెళ్లే మార్గంలో గేట్‌వాల్వ్ వద్ద కొన్ని నెలలుగా లీకేజీ ఉన్నా మున్సిపల్ సిబ్బంది మరమ్మతు చేయడం లేదు. దీంతో మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీరు వదిలినప్పుడు కొన్ని గంటల పాటు సుమారు 200 మీటర్ల వరకు రోడ్డు వెంట వృథాగా పారుతోంది. ముఖ్యంగా బైక్‌లు, కార్లు వెళ్తున్నప్పుడు ఈ నీరు మొత్తం పాదచారులపై పడుతోంది.
– పగడం మల్లేష్, పద్మావతికాలనీ
ప్రెషర్ తక్కువగా వస్తుంది..


