బ్యాంకింగ్ రంగంపై ప్రభావం..
బ్యాంకింగ్ రంగంలోనూ కృత్రిమ మేధ ప్రభావం చూపనుంది. రోజు జరిగే అన్ని వ్యవహారాలపై రిజర్వు బ్యాంక్ ప్రత్యక్ష నియంత్రణ కలిగి ఉంటుంది. ప్రజల డిపాజిట్లు కాపాడి.. వారికి మెరుగైన సేవలు అందించేందుకు ప్రతి స్థాయిలో నియంత్రణ అవసరం అవుతుంది. ఈ నియమాలు కచ్చితంగా అమలు చేయడం కోసం బ్యాంకులు ఆటోమేషన్ సాంకేతికతను వినియోగిస్తున్నాయి. దాన్ని రెగ్ టెక్ అని పిలుస్తాం. రెగ్ టెక్ పనితీరు మరింత మెరుగుపర్చడానికి కృత్రిమ మేధను బ్యాంకింగ్ రంగం వినియోగిస్తుంది.
– సురేష్, అధ్యాపకుడు, ఇబ్రహీంపట్నం ప్రభుత్వ కళాశాల


