వైభవంగా హనుమాన్ విజయయాత్ర
స్టేషన్ మహబూబ్‌నగర్: జిల్లాకేంద్రంలో హనుమన్ జయంతిని పురస్కరించుకొని శనివారం విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో వైభవంగా హనుమాన్ విజయయాత్ర నిర్వహించారు. స్థానిక రామమందిరం నుంచి మేళతాళాలతో స్వామివారి ఊరేగింపుతో విజయయాత్ర క్లాక్‌టవర్, అశోక్‌టాకీస్ చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా, న్యూటౌన్ చౌరస్తా మీదుగా టీటీడీ కల్యాణ మండపం వరకు నిర్వహించారు. అనంతరం హనుమంతుడి విగ్రహానికి పూజలు నిర్వహించారు. విశ్వహిందు పరిషత్, ఆర్‌ఎస్‌ఎస్, భజరంగ్‌దళ్, హిందువాహిని తదితర ధార్మిక సంస్థల నేతలు, కార్యకర్తలు కాషాయ ధ్వజాలను చేతబూని ఈ విజయయాత్రలో ముందుకు కదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ హనుమంతుడి జీవిత చరిత్ర మనకందరికీ ఆదర్శమని అన్నారు. ఆ దివ్య హనుమంతుడి ఆశీస్సులు మనందరిపై ఉండాలని ఆకాంక్షించారు. మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ విజయయాత్రలో పాల్గొని హనుమంతుడి విగ్రహానికి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ బెక్కరి అనిత, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్‌గౌడ్, నాయకులు ఏపీ మిథున్‌రెడ్డి, సిరాజ్‌ఖాద్రీ, సాయిబాబా, మనోహర్‌తో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు మద్ది యాదిరెడ్డి, లక్ష్మినారాయణ పాల్గొన్నారు.
వైభవంగా హనుమాన్ విజయయాత్ర


