వెళ్లొస్తాం.. లింగమయ్యా
పెరిగిన బందోబస్తు
గత ఉత్సవాల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పోలీస్, అటవీ శాఖలు సమన్వయంతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అయితే అంచనాలకు మించి వాహనాలు, భక్తులు రావడంతో వారి సేవలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ముందుస్తుగా అడవిలో చెత్త తొలగింపు, వాహనాలు, లోయ వద్ద భక్తుల రద్దీ నియంత్రణ, బారీకేడ్లు, భద్రత నిర్వహణను పోలీస్, అటవీ శాఖ సంయుక్తంగా చేపట్టింది. భక్తుల రద్దీకి అనుగుణంగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఉత్సవాలు సజావుగా ముగియడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. గతంలో మాదిరిగా ఎలాంటి అపశ్రుతి చోటు చేసుకోలేదు.
● ముగిసిన సలేశ్వరం బ్రహ్మోత్సవాలు
● మూడురోజుల్లో లింగమయ్య దర్శించుకున్న 2 లక్షల మంది భక్తులు
● ఫర్హాబాద్ చెక్‌పోస్టులు మూసివేత
అచ్చంపేట: నల్లమలలోని లోతట్టు ప్రాంతం సలేశ్వర క్షేత్రంలో వెలసిన లింగమయ్య ఉత్సవాలు ఆదివారం ముగిశాయి. మూడు రోజులపాటు నల్లమల కొండలు జనసంద్రంతో కిక్కిరిసి కనిపించాయి. మూడు రోజుల సెలవు దినాలు రావడంతో సలేశ్వరం దర్శనం కోసం భక్తులు బారులుదీరారు. దట్టమైన అటవీ ప్రాంతంలో కొలువైన సలేశ్వరం క్షేత్రం దర్శనానికి రాష్ట్రం నలుమూలల నుంచే కాక ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహరాష్ట్ర నుంచి భక్తులు తరలివచ్చారు. చివరిరోజు ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి వాహనాలు అడవిలోకి వెళ్లకుండా అటవీశాఖ నిలిపివేసింది. ఈసారి పోలీస్, అటవీ శాఖలు సమన్వయంతో ఇచ్చిన మూడు రోజుల వ్యవధిలో 24 గంటలపాటు సలేశ్వరం దర్శనానికి అనుమతించడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదు. రాత్రివేళ ఎక్కువ మంది లింగమయ్య దర్శనం చేసుకోవడం ఎంతో అనుభూతి ఇచ్చింది. అయితే ప్రతిఏటా చైత్రశుద్ధ పౌర్ణమి సందర్భంగా వర్షం కురిసేది. దీంతో వాహనదారులు, భక్తులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. అయితే రెండేళ్లుగా ఎలాంటి వర్షం కురవకపోవడంతో ఎలాంటి ఆటంకాలు ఎదురుకాలేదు. చివరిరోజు వస్తున్నాం.. లింగమయ్యా.. వెళ్లొస్తాం.. లింగమయ్యా అంటూ భక్తి పారవశ్యంలో మునిగితేలారు.
చెక్‌పోస్టుల మూసివేత
హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారిలోని ఫర్హాబాద్, లింగాల మండలం అప్పాయిపల్లి ప్రాంతంలోని చెక్‌పోస్టులను అటవీశాఖ అధికారులు మూసివేశారు. ఈసారి అంచనాలకు మించి వాహనాలు రావడంతో ట్రాఫిక్ నియంత్రణలో పోలీస్, అటవీ శాఖలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకు వాహనాల రద్దీ ఏమాత్రం తగ్గలేదు. శనివారం రాత్రి వాహనాలు భారీగా నిలిచిపోవడంతో టోల్‌చార్జీలు సైతం తీసుకోకుండానే లోపలికి అనుమతించారు. దీంతో ట్రాఫిక్ నియంత్రణ కొంత అదుపులోకి వచ్చింది. గతంలో మాదిరిగానే శ్రీశైలం వెళ్లే యాత్రికులకు మన్ననూర్ చెక్‌పోస్టును రాత్రి 9 గంటల వరకు అనుమతిస్తారు. సలేశ్వరం వెళ్లాలనుకునే భక్తులను మాత్రం అటవీ ప్రాంతంలోకి అనుమతించరు. అచ్చంపేట ఆర్టీసీ మొదటి రోజు 30, రెండో రోజు 36, మూడోజు16 ట్రిప్పుల చొప్పున బస్సులు నడిపించారు. అటవీ ప్రాంతంలో ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని చివరి రోజు ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకే బస్సులను నిలిపివేశారు.
చిన్న పిల్లలతో కలిసి..
స్వచ్ఛంద సంస్థలు, దాతల సేవలు..
స్వచ్ఛంద సంస్థలు, దాతలు ఏర్పాటు చేసిన అన్నదానం, అంబలి కేంద్రాలు, తాగునీటి వసతి భక్తులకు ఎంతగానో ఉపకరించాయి. సలేశ్వరం ఉత్సవాలతో అటవీశాఖ ముక్కుపిండి టోల్ ేరుసుం వసూలు చేసింది. సలేశ్వరం ఉత్సవాలు మాత్రం అటవీ శాఖకు మంచి ఆదాయ వనరుగా నిలిచిపోయిందనే చర్చ సాగుతోంది. ప్రతిఏటా రూ.లక్షలాది ఆదాయం సమకూరుతున్న అటవీశాఖ సరైన ఏర్పాట్లు చేయలేకపోతోంది.
వెళ్లొస్తాం.. లింగమయ్యా
వెళ్లొస్తాం.. లింగమయ్యా
వెళ్లొస్తాం.. లింగమయ్యా
వెళ్లొస్తాం.. లింగమయ్యా
వెళ్లొస్తాం.. లింగమయ్యా
వెళ్లొస్తాం.. లింగమయ్యా
వెళ్లొస్తాం.. లింగమయ్యా
వెళ్లొస్తాం.. లింగమయ్యా


