రైతుల కష్టం నీటిపాలు
●
ఎడెకరాల్లో పంట దెబ్బతింది..
ఎడెకరాల్లో సాగుచేసిన వరిపంట మొత్తం దెబ్బతింది. వడగండ్ల వానకు వడ్లు నేలరాలడంతో 70శాతం వరకు నష్టం వాటిల్లింది. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలి.
– నర్సింహారెడ్డి, రైతు, అయ్యవారిపల్లి, మిడ్జిల్ మండలం
400 బస్తాల ధాన్యం తడిసింది..
మద్దతు ధరకు అమ్ముకోవాలని 400 బస్తాల ధాన్యాన్ని మార్కెట్‌లోని సీసీరోడ్డుపై ఆరబోశాను. అకాల వర్షాంతో ధాన్యం అంతా తడిసి ముద్దయింది. కొనుగోలు కేంద్రంలో అయితే మద్దతు ధరతో పాటు బోనస్ వస్తుందని ఆశ పడగా.. ధాన్యం అంతా నీటిపాలు అయింది.
– వర్కుటి లక్ష్మారెడ్డి, రైతు, దేవరకద్ర
కొనుగోలు కేంద్రం ప్రారంభించాలి..
కొనుగోలు కేంద్రం ప్రారంభం అవుతుందని చెప్పడంతో రెండు రోజుల నుంచి మార్కెట్ ఆవరణలో ఽ300 బస్తాల ధాన్యాన్ని అరబెట్టుకుంటున్న. మార్కెట్‌లో అమ్మితే రూ. వెయ్యి వరకు తక్కువ ధర వస్తుంది. అదే కొనుగోలు కేంద్రంలో అయితే మద్దతు ధరతో పాటు బోనస్ వస్తుందని ఎదురుచూస్తున్నా. అకాల వర్షంతో ధాన్యం మొత్తం తడిసి ముద్దయింది.
– బండ కొండారెడ్డి, రైతు, దేవరకద్ర
కుప్పగా పోసేందుకు
కూడా సమయం లేదు..
ఆరబెట్టుకున్న ధాన్యం కళ్లెదుటే తడిసిపోయింది. కనీసం కుప్పగా పోసుకోడానికి కూడా సమయం దొరకలేదు. భారీ వర్షానికి 600 బస్తాల ధాన్యం తడిసిపోగా.. మరికొంత నీటిలో కొట్టుకుపోయింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఇలా నీటిపాలు అవుతుంటే చూస్తున్న తప్ప రక్షించుకునే పరిస్థితి కనిపించలేదు. అధికారులు స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆదుకోవాలి.
– డోకూర్ హన్మిరెడ్డి, రైతు, దేవరకద్ర
మహబూబ్‌నగర్ (వ్యవసాయం)/దేవరకద్ర/మిడ్జిల్/కల్వకుర్తి రూరల్/వెల్దండ: ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంట వరుణుడి దెబ్బకు తడిసి ముద్దయింది. ఇది చూసిన రైతు అయ్యో వరుణదేవా ఏందీ పరిస్థితి అని గుండెలవిసేలా రోదిస్తున్నాడు. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. మరికొన్ని చోట్ల గాలి దుమారానికి చెట్లు నేలకొరిగాయి. దేవరకద్ర, మహబూబ్‌నగర్ రూరల్, కల్వకుర్తి, మిడ్జిల్, వెల్దండ మండలాల్లో కురిసిన అకాల వర్షంతో ధాన్యం తడిసి ముద్దయింది. నాటు వేసినప్పటి నుంచి కోత కోసే దాక తెగుళ్ల బారి నుంచి పంటను కాపాడుకుంటున్న పంట.. చేతికి వచ్చే సరికి అకాల వర్షాలతో దెబ్బతింటుందని రైతులు వాపోతున్నారు. పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వపరంగా ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
● మహబూబ్‌నగర్ రూరల్ మండలం మన్యంకొండ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం వద్ద కుప్పలుగా పోసిన వరి ధాన్యం వర్షానికి తడిసిపోయింది. వర్షం పడే సమయానికి రైతులు అక్కడి చేరుకొని ధాన్యాన్ని కుప్పగా పోసినప్పటికీ.. కప్పడానికి సరైనా టార్పాలిన్లు లేకపోవడంతో ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పాయిపల్లి, మాచన్‌పల్లి, ఓబ్లాయిపల్లి, తండా, రామచంద్రాపూర్, కోడూర్, తెలుగుగూడెం తదితర గ్రామాల్లో వడగండ్లు పడటంతో వరిపంటలు దెబ్బతిన్నాయి. గాలివాన కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
● మిడ్జిల్ మండలం మిడ్జిల్, వాడ్యాల్, వెలుగొమ్ముల, అయ్యవారిపల్లి, చిల్వేర్ గ్రామాల్లో వరిపంట నేలకొరిగింది. 50 నుంచి 65శాతం మేర వడ్లు నేలరాలినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
● కల్వకుర్తి మండలంలోని తాండ్ర గ్రామంలో ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షం కురవడంతో 15 మంది రైతులకు చెందిన 40 ఎకరాల వరిపంట దెబ్బతింది. అకాల వర్షానికి వరిపంట దెబ్బతినడంతో పెట్టిన పెట్టుబడి కూడా చేతికొచ్చే పరిస్థితి లేకుండాపోయిందని రైతులు వాపోతున్నారు.
మహబూబ్‌నగర్ రూరల్ మండలంలోని ఆయా గ్రామాల్లో కురిసిన అకాల వర్షానికి తడిసిన ధాన్యంతో పాటు దెబ్బతిన్న పంటలను బీఆర్‌ఎస్ నాయకులు పరిశీలించారు. కోడూర్, తెలుగుగూడెం, అప్పాయిపల్లి, ఓబ్లాయిపల్లి, తండా, కోటకదిర, మాచన్‌పల్లి గ్రామాల్లో అకాల వర్షంతో రైతులకు అపారనష్టం చేకూరిందని.. ఎకరాకు రూ. 30వేల పరిహారం చెల్లించి ఆదుకోవాలని మాజీ జెడ్పీటీసీ పి.రవీందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మల్లు దేవేందర్‌రెడ్డి, నాయకులు రాఘవేందర్‌గౌడ్, లక్ష్మారెడ్డి, వెంకటస్వామి, మస్తాన్‌లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
దేవరకద్ర మార్కెట్‌లో వర్షంలో తడుస్తున్న ఆరబెట్టిన ధాన్యం
ఎకరాకు
రూ. 30వేల పరిహారం ఇవ్వాలి
ఓబ్లాయిపల్లిలో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలిస్తున్న బీఆర్‌ఎస్ నాయకులు
అకాల వర్షంతో తడిసిన వడ్లు
దేవరకద్ర మార్కెట్‌లో తడిసి
ముద్దయిన 2వేల బస్తాల ధాన్యం
ప్రభుత్వం ఆదుకోవాలంటున్న రైతులు
వెల్దండ మండలంలోని చొక్కన్నపల్లి, కుందారంతండా, బండోనిపల్లి తదితర గ్రామాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ వర్షంతో పాటు ఈదురుగాలుల దుమారంతో కుందారంతండాలో విద్యుత్ స్తంభాలు, భారీ చెట్లు నేలకొరిగి ఇళ్లపై పడ్డాయి. పలువురి ఇళ్ల సిమెంట్ రేకులు ధ్వంసమైనట్లు స్థానికులు తెలిపారు. బండోనిపల్లిలో పిడుగుపాటుకు గురై రైతు వావిళ్ల పర్వతాలు అస్వస్తతకు గురయ్యారు.
దేవరకద్ర మార్కెట్‌యార్డులో రెండు రోజుల క్రితం ఆరబోసిన 2వేల బస్తాల ధాన్యం తడిసి ముద్దయింది. మార్కెట్‌కు రెండు రోజులపాటు సెలవు కారణంగా లావాదేవీలు జరగడం లేదు. మంగళవారం మార్కెట్‌లో ధాన్యాన్ని విక్రయించవచ్చని కొందరు, కొనుగోలు కేంద్రం ప్రారంభమైతే మద్దతు ధరకు అమ్ముకోవచ్చని మరికొందరు రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకోగా.. అకాల వర్షం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. అదే విధంగా దేవరకద్ర సమీపంలోని అమ్మాపూర్ రోడ్డులో ఆరబెట్టుకున్న ధాన్యం తడిసి ముద్దయింది. కల్లాలు లేక పోవడం వల్ల పలువురు రైతులు దేవస్థానం పొలంలో ఆరబెట్టుకుంటుండగా.. అకాల వర్షానికి ధాన్యం తడిసి పోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
రైతుల కష్టం నీటిపాలు
రైతుల కష్టం నీటిపాలు
రైతుల కష్టం నీటిపాలు
రైతుల కష్టం నీటిపాలు
రైతుల కష్టం నీటిపాలు
రైతుల కష్టం నీటిపాలు
రైతుల కష్టం నీటిపాలు
రైతుల కష్టం నీటిపాలు
రైతుల కష్టం నీటిపాలు


