దేవరగుట్టలో సీసీ కెమెరాల నిఘా
నవాబుపేట: మండలంలోని యన్మన్‌గండ్ల దేవరగుట్టపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ఫారెస్టు అధికారి చంద్రయ్య తెలిపారు. గురువారం ఆయన సిబ్బందితో కలిసి చిరుతలు నివాసం ఉంటున్న గుట్టను పరిశీలించారు. తమకు, పశువులకు ప్రాణహాని ఉందని చిరుతల నుంచి కాపాడాలని గ్రామస్తులు కోరారు. గ్రామానికి దగ్గరగా ఉన్న గుట్టలో చిరుతలు ఉండటంతో నిత్యం భయంతో జీవిస్తున్నామని రక్షణ కల్పించాలన్నారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ అధికారి మాట్లాడుతూ.. దేవరగుట్టలో చిరుతలు ఆవాసం ఏర్పాటు చేసుకున్నాయని, పరిసరాల్లోకి వెళ్లరాదని సూచించారు. చిరుతల కదలికలు గుర్తించేందుకు ముందుగా గుట్ట ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సీసీ కెమెరాల్లో వాటి కదలికల ఆధారంగా బోనుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంటామని వివరించారు.
● బోన్ల ఏర్పాటుపై
త్వరలో నిర్ణయం


