పంట పొలాల్లోకి కాలుష్య జలాలు
రాజాపూర్: చిన్నపాటి వర్షం కురిస్తే చాలు.. కాలుష్య జలాలు బయటకు వదిలేందుకు పరిశ్రమల యాజమాన్యానికి అవకాశం వచ్చినట్లే. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం సాయంత్రం ఈదురు గాలులతో పాటు ఓ మోస్తరు వర్షం కురిసింది. దీనిని అదునుగా చేసుకొని పోలేపల్లి సెజ్‌లో ఉన్న ఓ పరిశ్రమ వర్షపు నీటి చాటున కాలుష్య జలాలను రైతుల పొలాల్లోకి వదిలింది. రైతులు వీటి ఫొటో తీసి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు, ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డికి సమాచారం ఇచ్చారు. జల, వాయు కాలుష్యంతో పాటు శబ్ధ కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నామని.. ఆయా పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని ముదిరెడ్డిపల్లి, రాయపల్లి గ్రామాల ప్రజలు కోరుతున్నారు.


