‘జేఈఈ’లో అత్యుత్తమ ‘ప్రతిభ’
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రంలోని ప్రతిభ జూనియర్ కళాశాల విద్యార్థులు జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో విజయదుంధుబి మోగించారు. ఆలిండియా స్థాయిలో విద్యార్థులు విశాల్ 281వ ర్యాంకు, సాకేత్‌కుమార్‌రెడ్డి 98.75 పర్సంటైల్‌తో 2,587వ ర్యాంకు సాధించారు. వీరితో పాటు భీంసింగ్ రాథోడ్ 2,683, తిరుపతి 4,952వ ర్యాంకు, కేదార్‌నాథ్ 98.28 పర్సంటైల్‌తో 6,988వ ర్యాంకు, వర్షిత్‌గౌడ్ 98.15 పర్సంటైల్‌తో 7,661వ ర్యాంకు, ప్రేమ్‌చంద్ 7,682వ ర్యాంకు సాధించగా.. కె.భరత్ 96.16, సి.జతిన్ 96.03, నాగకౌశిక 96.95, భానుప్రదీప్ 95.43, సాయి జశ్వంత్‌రెడ్డి 95.39, సాయి రేవంత్‌రెడ్డి, 95.04 పర్సంటైల్ సాధించారు. 90 పర్సంటైల్‌కు పైగా 48మంది, 80 నుంచి 90 పర్సంటైల్ మధ్య 62 మంది సాధించారని.. ఫలితాల్లో 198 మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్ పరీక్షకు అర్హత సాధించినట్లు కళాశాల యాజమాన్యం పేర్కొంది. కార్యక్రమంలో డైరెక్టర్స్ మంజులాదేవి, లక్ష్మారెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, ప్రిన్సిపాల్, అధ్యాపకులు పాల్గొన్నారు.


