పది రోజుల తర్వాత కోసేదుండే
నాకు సొంతంగా మా గ్రామంలో 2.75 ఎకరాల భూమి ఉంది. ఆ పొలంలో వరి పంట వేసిన. ఇంకో 10–15 రోజులైతే వరి పూర్తిగా కోతకు వచ్చేది. వాన భయంతో ముందుగానే కోయించిన. కొంత పొల్లు పోయినా వాన పడితే ఇత్తు చేతికి రాదనే భయంతోనే కోయించిన. ఏం చేస్తాం బాకీ ఉన్న కాడికి అయితాయి. ఇంకా 10 రోజులు ఉంచితే చేతికొస్తదనే గ్యారంటీ లేదాయే. నేనే కాదు చాలా మంది పచ్చి చేలనే కోయిస్తుండ్రు.
– బోయ నర్సిములు, రైతు, మాచన్‌పల్లి గ్రామం, మహబూబ్‌నగర్ రూరల్
ఎర్రబడక ముందే కోస్తే నష్టం
వరి పంటలు పూర్తిగా ఎర్రబడక ముందే కోయడం వల్ల నష్టం వాటిల్లుతుంది. వరి గొలుసులు 85 నుంచి 90 శాతం వరకు ఎర్రబడ్డ తర్వాతనే కోస్తే దిగుబడి మంచిగా వస్తుంది. వానల భయంతో రైతులు పూర్తిగా గొలుసు కాకముందే కోస్తుండడం వల్ల చాలా వరకు గింజలు తాలు పోయే పరిస్థితి ఉంటుంది.
– బి.వెంకటేష్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి
●
పది రోజుల తర్వాత కోసేదుండే


