దేవరగుట్టలోనే చిరుతలు
నవాబుపేట: ఈ గుట్ట నాదే.. ఈ ప్రాంతం నాదే.. అనే చిరుత సినిమాలోని డైలాగ్ తరహాలో నవాబుపేట మండలం యన్మన్‌గండ్ల దేవరగుట్టపై చిరుతలు తిష్ట వేశాయి. సోమవారం గుట్ట పైభాగంలో ఓ చిరుత దర్జాగా కూర్చుని కనిపించింది. కాగా, గుట్టను ఆవాసంగా చేసుకున్న రెండు చిరుతలను బంధించేందుకు అటవీశాఖ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. నాలుగు రోజుల క్రితం గుట్టపై సీసీ కెమెరాలతో పాటు బోన్ ఏర్పాటు చేసినప్పటికీ చిరుతలు చిక్కడం లేదు. దేవరగుట్టలోనే చిరుతలు ఉండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సీసీ నిఘా మధ్య చిరుతలకు అటవీశాఖ అధికారులు గస్తీ ఏర్పాటు చేసినట్టుగా చిరుతల తీరు ఉందని చర్చించుకుంటున్నారు.


