మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలని పీయూ వైస్‌చాన్స్‌లర్ జీఎస్ శ్రీనివాస్ పేర్కొన్నారు. పీయూలో ఏర్పాటు చేసిన మహనీయుల జయంతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. సమాజంలో ఉన్న అనేక రుగ్మతలను రూపుమాపేందుకు ఎంతో మంది గొప్ప వ్యక్తులు జీవితాంతం కృషి చేశారని, వారి కృషి వల్ల ఎంతో మంది అట్టడుగు వర్గాల వారికి మేలు జరిగిందన్నారు. మహనీయుల జయంతులు చేస్తే వారి ఆశయాలను కొనసాగించినట్లు కాదని, వారు ఎలాంటి సేవలు చేయడం వల్ల గొప్ప వ్యక్తులయ్యారనే అంశాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్సీ జానకి మాట్లాడుతూ గతంలో మహనీయులు చేసిన త్యాగాల వల్లే అన్ని వర్గాల వారు స్వేచ్ఛ సమానత్వంతో మెలుగుతున్నారని, నేటి తరం యువతకు కూడా సమాజసేవ చేసేందుకు తమ వంతుగా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో కార్యక్రమంలో ప్రొఫెసర్ కాశీం, పీయూ రిజిస్ట్రార్ రమేష్‌బాబు, పీయూ ప్రిన్సిపాల్ మధుసూదన్‌రెడ్డి, కుమారస్వామి, ప్రవీణ తదితరులు పాల్గొన్నారు.


