
వాగ్దేవి విద్యార్థుల విజయ దుందుభి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో జిల్లా కేంద్రంలోని వాగ్దేవి కళాశాల విద్యార్థులు విజయ దుందుభి మోగించారని కళాశాల కరస్పాండెంట్ విజేత వెంకట్‌రెడ్డి తెలిపారు. మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో అమీనా 468, అక్షయశ్రీ 466, అమృత వర్షిణి 465, వైశాలి 465 మార్కులు సాధించగా.. బైపీసీ విభాగంలో సంజన 436, అలానే ఫరీహ 435, పాయల్ సింగ్ 435, మదియా తరహా 435 మార్కులు సాధించారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో నవనీత్‌గౌడ్ 992, బైపీసీ విభాగంలో రబ్‌షా 991, సఫూరా 989 మార్కులతో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని ఆయన పేర్కొన్నారు. కళాశాలలో ఇన్నోవేటివ్ సైంటిఫిక్ టీచింగ్ అప్రొచ్ కార్యక్రమం ద్వారా విద్యార్థులు మంచి మార్కులు సాధించారన్నారు. ఇంతటి ఘనవిజయం సాధించేందుకు సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులు, అధ్యాపకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ గీతాదేవి, అకాడమిక్ ఇన్‌చార్జి పావని, కోట్ల శివకుమార్, రాఘవేందర్‌రావు, నాగేందర్, సతీశ్‌రెడ్డి, బాబుల్‌రెడ్డి, రఘువర్ధన్‌రెడ్డి, జ్యోతినందన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.