పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు..
సోమశిల వద్ద కృష్ణాతీరం వద్దకు హైదరాబాద్, ఇతర ప్రాంతాల నుంచి నిత్యం పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. సంగమేశ్వరుడి దర్శనం కోసం కృష్ణానదిలో బోటులో వెళ్లాల్సి ఉండగా, ఏపీకి చెందిన సిద్దేశ్వరం, సంగమేశ్వర గ్రామాల జాలర్లు బోట్లను రానివ్వడం లేదు. కొద్ది దూరం బోటులో, తర్వాత ఆటోలో, మళ్లీ బోటులో ప్రయాణిస్తూ కష్టాలు పడుతున్నారు. పర్యాటకులు, భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి. – రామ్మోహన్,
సోమశిల, కొల్లాపూర్ మండలం


