హజ్‌లో ప్రజల క్షేమం కోసం ప్రార్థించాలి
స్టేషన్ మహబూబ్‌నగర్: పవిత్ర యాజ్‌యాత్రలో జిల్లా క్షేమం కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం మౌలానా సఘీర్ అహ్మద్ నక్షబంది అన్నారు. జిల్లా కేంద్రంలోని జామీయ మసీద్‌లో శుక్రవారం జుమా నమాజ్ అనంతరం మేనేజింగ్ కమిటీ ఆధ్వర్యంలో హజ్‌యాత్రికులను ఘనంగా సన్మానించారు. మహెరుమాలు, పూలమాలలతో సత్కరించారు. మౌలానా సఘీర్ అహ్మద్ మాట్లాడుతూ పవిత్ర హజ్‌యాత్ర చేయడానికి అవకాశం రావడం ఎంతో అదృష్టమన్నారు. కార్యక్రమంలో కమిటీ ఉపాధ్యక్షులు సయ్యద్ అమీనుద్దీన్, సమద్‌ఖాన్, కార్యదర్శి మహ్మద్ జకీ, ఇసాక్, మహ్మద్ కలీం, సయ్యద్ సుల్తాన్, తన్వీర్, జఫర్, జహంగీర్‌పాష ఖాద్రీ, తదితరులు పాల్గొన్నారు.


