నకిలీ మందులు విక్రయిస్తే చర్యలు
నాగర్‌కర్నూల్ రూరల్: రైతులకు నకిలీ మందులు, విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని వ్యవసాయ కమిషన్ డైరెక్టర్ కేవీఎన్‌రెడ్డి అన్నారు. క్రిమిసంహారక మందు వినియోగించి నష్టపోయిన మండలంలోని చందుబట్ల, నర్సాయిపల్లి గ్రామాల్లోని శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మారెడ్డి రైతుల వరి పంటను వ్యవసాయ శాఖ అధికారులు, పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన క్షేత్రం శాస్త్రవేత్తలతో కలిసి శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.. రైతులకు నష్టం కల్గించే ఏజెన్సీలపై సహించేది లేదని హెచ్చరించారు. భూత్పూరు, ములుగు ప్రాంతాల్లో నకిలీ మందులు, విత్తనాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో నివేదికలు తెప్పించుకుని పంట నష్టపోయిన రైతులకు న్యాయం చేస్తామని కెవీఎన్‌రెడ్డి అన్నారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నిందితుడికి రిమాండ్
కోస్గి రూరల్: మైనర్‌ను అపహరించి అత్యాచారం చేసిన ఘటనలో ఓ వ్యక్తిని శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ బాల్‌రాజ్ వివరాల ప్రకారం దోమ మండలంలోని మల్లేపల్లి గ్రామానికి చెందిన రమేష్ కోస్గి మండలంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్‌ను అపహరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చాగా ఇన్‌చార్జి మెజిస్ట్రేట్ మమతరెడ్డి 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ మేరకు నిందితుడిని జిల్లా జైలుకు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.


