
గ్రామస్థాయిలో కమిటీలు..
నారాయణపేట జిలా్‌ాల్గ ఏర్పడిన తర్వాత ప్రత్యేకంగా మాతాశిశు సంరక్షణ, సఖి కేంద్రాలు ఏర్పాటయ్యాయి. బాల్యవివాహాలతో కలిగే అనర్థాలపై బాలల సంరక్షణ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో బాల్యవివాహాలను నిరోధించడానికి ప్రభుత్వం పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేసింది. గ్రామ కమిటీల్లో సర్పంచ్ చైర్మన్‌గా, పంచాయతీ కార్యదర్శి, వీఆర్‌ఓ, ప్రభుత్వ ఉపాధ్యాయులు, మహిళా సంఘం సభ్యురాలు, వార్డు సభ్యులు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశావర్కర్లను సభ్యులుగా నియమించింది. గ్రామీణ ప్రజల్లో చైతన్యం నింపుతూ.. బాల్యవివాహాలను అరికట్టాల్సిన అవసరం ఉండగా.. క్షేత్రస్థాయిలో కమిటీల పనితీరు నామమాత్రంగానే ఉంటుంది.