● హోల్డ్‌లో పెట్టిన డబ్బులు విడుదల చేయాలని డిమాండ్
ఆదిలాబాద్‌టౌన్: తమ అకౌంట్లో ఉన్న డబ్బులను బ్యాంక్ అధికారులు హోల్డ్‌లో పెట్టారని ముగ్గురు రైతులు నిరసన చేపట్టారు. పట్టణంలోని ధనలక్ష్మి లాడ్జి వద్ద గల ఎస్బీఐలో మంగళవారం ఆందోళన కు దిగారు. భీంపూర్ మండలంలోని వడూర్‌కు చెందిన మోహన్, తంతోలికి చెందిన నక్కల జగదీశ్, యాపల్‌గూడకు చెందిన మరో రైతుకు సంబంధించి ఎస్బీఐ మెయిన్ బ్రాంచి, మహారాష్ట్ర బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయి. గతేడాది సీసీఐ ద్వారా పత్తి వి క్రయించిన డబ్బులు పోస్టాఫీసులో జమ కాగా, పో స్టల్ పేమెంట్ అధికారి వారికి తెలియకుండా డబ్బులు కాజేసిన విషయం తెలిసిందే. సైబర్‌క్రైమ్ కింద కేసు నమోదైంది. కొన్నిరోజుల తర్వా త రైతుల ఖా తాల్లో డబ్బులు జమ చేశారు. ఢిల్లీకి సంబంధించిన అధికారులు బ్యాంక్‌లో ఉన్న వీరి డబ్బులను హోల్డ్‌లో పెట్టారు. పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోకపోవడంతో బ్యాంక్‌లో నిరసన చే పట్టడంతో అధికారులు ఉన్నతాధికారులకు సమాచా రం అందించారు. సాయంత్రం వరకు హోల్డ్‌లో ఉన్న వారి డబ్బులను తీయించే విధంగా చూస్తామ ని హామీ ఇచ్చారు. పోలీసులు క్లియరెన్స్ ఇచ్చినప్పటికీ అధికారులు హోల్డ్ తీయకపోవడం పట్ల వారు మండిపడ్డారు. సమస్యను పరిష్కరించేలా చూస్తామని ఎస్బీఐ చీఫ్ మేనేజర్ సత్యనారాయణ హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.
Comments
Please login to add a commentAdd a comment