ఏడుగురు విద్యార్థులపై కేసు
చెన్నూర్: చెన్నూర్ మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల విద్యార్థి మనోజ్‌పై దాడి చేసిన ఏడుగురు విద్యార్థులపై కేసు నమోదు చేసినట్లు సీఐ రవీందర్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఈనెల 6న బీసీ గురుకుల పాఠశాలలో చదువుతున్న నస్పూర్ గ్రామంలోని ఇందారం కాలనీకి చెందిన విద్యార్థి పులి మనోజ్‌పై తోటి విద్యార్థులు దాడి చేసి వీడియో చిత్రీకరించి ఇన్‌స్ర్ట్రాగాంలో పోస్ట్ చేశారని బాధిత విద్యార్థి తండ్రి రాజేందర్‌గౌడ్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రఘునాఽథ్, విజయ్, యువరాజ్, రజనీకాంత్, మణికంఠ, సన్నీ, సిద్దూపై కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. ఈ ఘటనలో ప్రిన్సిపాల్‌ను విధుల నుంచి తొలగించడంపై విద్యార్థులు ఆందోళనకు దిగేందుకు ప్రేరేపించిన వారిపై చ ర్యలు తీసుకుంటామని జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం పాఠశాల ను సందర్శించారు. విద్యార్థులు రోడ్డు పైకి వచ్చి ఆందోళన చేపట్టవద్దన్నారు. సమగ్ర విచారణ జరిపి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపిస్తామన్నారు. సీఐ రవీందర్, ఆర్సీవో శ్రీధర్, ఎంఈవో రాధాకృష్ణమూర్తి, ప్రిన్సిపాల్ రాజ్‌కుమార్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment