ఇద్దరు ఆటోడ్రైవర్లకు ఆరునెలల జైలు
లక్ష్మణచాంద: రోడ్డు ప్రమాదానికి కారణమైన ఇద్దరు ఆటోడ్రైవర్లకు ఆరునెలల జైలుశిక్షతోపాటు ఒక్కొక్కరికి రూ.500 జరిమానా విధిస్తూ నిర్మల్ ఫస్ట్‌క్లాస్ మె జిస్ట్రేట్ ఆర్.అజయ్‌కుమార్ మంగళవారం తీర్పునిచ్చారు. ఎస్సై సుమలత కథనం ప్రకారం.. 2016 నవంబర్ 23న మండలంలోని వడ్యాల్ శివారులోని సరస్వతి కెనాల్ బ్రిడ్జి వద్ద ఎదురెదురుగా రెండు ఆటోలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వడ్యాల్‌కు చెందిన బొచ్చు రాజవ్వ, లక్ష్మణచాంద గ్రా మానికి చెందిన నిమ్మల గోదావరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై లక్ష్మ ణచాంద పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. అడిషనల్ పీపీ దేవేందర్ సాక్షులను ప్రవేశపెట్టి కేసు రుజువు చేశారు. ప్రమాదానికి కా రణమైన ఇద్దరు ఆటోడ్రైవర్లు షేక్ ఇమ్రాన్, షేక్ సోఫీలకు జైలుశిక్షతోపాటు జరిమానా విధిస్తూ మెజిస్ట్రేట్ తీర్పుచెప్పారు.
తాళం వేసిన ఇంట్లో చోరీ
లక్సెట్టిపేట: మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల గ్రామంలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. ఎస్సై సతీశ్ కథనం ప్రకారం.. ఈనెల 13న కాందపు ప్రసాద్ ఇంటికి తాళం వేసి కుటుంబంతో కలిసి హైదరాబాద్ వెళ్లారు. మంగళవారం తిరిగి వచ్చేసరికి తాళం పగులగొట్టి ఉంది. ఇంట్లోకి వెళ్లి బీరువా చూడగా గుర్తుతెలియని వ్యక్తులు బంగారు చెవికమ్మలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. సోమవారం రాత్రి గ్రామానికి చెందిన వేముల రామయ్య ఇంట్లో తాళాన్ని పగులగొట్టిన దొంగలు బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
బైక్ చోరీ
ఆదిలాబాద్‌టౌన్: పట్టణంలోని తాటిగూడకు చెందిన షేక్ ఆయుబ్ బైక్ చోరీకి గురైంది. ఈనెల 12న ఇందిరా ప్రియదర్శని స్టేడియంలో సాయంత్రం వాకింగ్ కోసం వెళ్లా డు. స్టేడియంలో పార్కింగ్ చేసి గంట తర్వా త తిరిగి వచ్చేసరికి బైక్ కనిపించలేదు. చు ట్టూపక్కల గాలించినా దొరకలేదు. మంగళవారం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎస్సై సయ్యద్ ఇసాక్ ఆలీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment