ఎస్కార్ట్ నుంచి తప్పించుకున్న నిందితుడికి ఏడాది జైలు
బెల్లంపల్లి: పోలీసు ఎస్కార్ట్ నుంచి చాకచక్యంగా తప్పించుకున్న నిందితుడికి ఏడాది సాధారణ జైలుశిక్ష విధిస్తూ జ్యూడీషియల్ ఫ్లస్ట్‌క్లాస్ మేజిస్ట్రెట్ జె.ముకేష్ మంగళవారం తీర్పుచెప్పారు. బెల్లంపల్లి వన్‌టౌన్ ఎస్‌హెచ్‌ఓ ఎన్.దేవయ్య కథనం ప్రకారం.. నెన్నెల మండలం కోనంపేటకు చెందిన నాయిని బాపు.. పది నేరాల్లో నిందితుడిగా ఉన్నాడు. 2024 అక్టోబర్ 16న కుమురంభీం జిల్లా కేంద్రంలోని సబ్ జైలు నుంచి ఇద్దరు పోలీసుల ఎస్కార్ట్‌తో బెల్లంపల్లి జూనియర్ సివిల్ కోర్టుకు తీసుకువచ్చారు. కోర్టులో సాక్షుల బయానా అనంతరం తిరిగి జైలుకు తీసుకెళ్తుండగా కాంటా చౌరస్తా వద్ద బస్సు ఎక్కేక్రమంలో బాపు పోలీసులను బలవంతంగా నెట్టివేసి పారిపోయాడు. ఈఘటనపై ఏఆర్ పోలీసు హెడ్‌కానిస్టేబుల్ నాగరాజు ఫిర్యాదుతో ఎస్‌హెచ్‌ఓ దేవయ్య కేసు దర్యాప్తు చేపట్టారు. నిందితుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టి మరుసటి రోజు పట్టుకుని తిరిగి ఆసిఫాబాద్ సబ్ జైలుకు తరలించారు. ఎస్‌హెచ్‌ఓ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఏపీపీ కె.అజయ్‌కుమార్ ఎనిమిది మంది సాక్షులను ప్రవేశపెట్టి నేరం రుజువుచేశారు. ఈ మేరకు మేజిస్ట్రెట్ తీర్పునిచ్చారు.
ఇనుపసామగ్రి చోరీకి యత్నించిన వ్యక్తి పట్టివేత
జైపూర్: మండలంలోని టేకుమట్ల శివారులో గల శ్రీరాంపూర్ నుంచి ఎస్టీపీపీకి బొగ్గు రవా ణా చేసే రైల్వేట్రాక్‌లైన్‌కు సంబంధించిన ఇను ప సామగ్రి చోరీకి యత్నించిన వ్యక్తిని మంగళవారం స్థానికులు పట్టుకున్నారు. శ్రీరాంపూర్ కు చెందిన ప్రవీణ్‌తోపాటు మరో వ్యక్తి టేకుమట్ల శివారులో రైల్వేపట్టాలను కట్ చేసి, ట్రాక్‌పక్కన పడేసిన ఇనుప సామగ్రిని ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. గమనించిన పవర్ ప్లాంటు కార్మి కులు, స్థానికులు ప్రవీణ్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మరొకరు పరారీలో ఉన్నా డు. ఈమేరకు పోలీసులు విచారణ చేపట్టారు
అటవీభూమిలో
గుడిసెల తొలగింపు
జన్నారం: అటవీ భూమిలో అక్రమంగా వేసుకున్న గుడిసెలను ఫారెస్టు సిబ్బంది తొలగించారు. వివరాలు ఇలా ఉన్నాయి..జన్నారం రేంజ్‌లోని కిష్టాపూర్ శివారులోని గడ్డంగూడ, గొండుగూడ గ్రామాల సమీపంలో కంపార్టుమెంట్ నంబర్ 308లో కొన్నినెలల క్రితం కొందరు గిరిజనులు, గిరిజనేతరులు గుడిసెలు వేసుకున్నారు. పక్కనే కొంత భూమిని సాగు చేసుకున్నారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. వారి ఆదేశాల మేరకు మంగళవారం తెల్లవారు జామున 3 గంటలకు జన్నారం, ఇందన్‌పల్లి అటవీరేంజ్ అధికారులు సుష్మారావు, కారం శ్రీనివాస్, సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. జేసీబీతో గుడిసెలను తొలగించి నేలమట్టం చేశారు. గుడిసెలకు వేసుకున్న కర్రను డివిజన్‌కు తరలించారు. పలుమార్లు చెప్పిన వినకపోవడంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో గుడిసెలను తొలగించినట్లు రేంజ్ అధికారులు తెలిపారు. ఏళ్లుగా ఉంటున్న మా గుడిసెలను అన్యాయంగా తొలగించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment