అనాథ మహిళ మృతి
మందమర్రిరూరల్: పట్టణంలోని పాతబస్టాండ్ ప్రా ంతంలో మతిస్థిమితం లేని అనాథ వృద్ధురాలిని గతేడాది డిసెంబర్ 9న అమ్మ స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఏఎస్సై శ్రీనివాస్ మంచిర్యాల కల్వరీ యు వశక్తి అనాథ వృద్ధుల, మానసిక వికలాంగుల ఆశ్రమంలో చేర్పించారు. జనవరి 23న ఆమె అనారోగ్యంతో ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందు తూ మంగళవారం మృతి చెందిందని మందమర్రి ఎస్సై రాజశేఖర్ తెలిపారు. వృద్ధురాలి మృతదేహం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీలో భద్రపర్చినట్లు పేర్కొన్నారు. ఎవరికైనా వివరాలు తెలిస్తే పోలీసులను సంప్రదించాలని సూచించారు.
కారు, బైక్ ఢీ: ఒకరు మృతి
నిర్మల్‌రూరల్: ఆగి ఉన్న బైక్‌ను అతివేగంగా వచ్చి న కారు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందినట్లు రూరల్ ఎస్సై లింబాద్రి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మామడ మండలం కిషన్‌రావుపేటకు చెందిన ఆత్మారం(55), కుమారుడు శ్రీకాంత్ బైక్‌పై మంగళవారం నిర్మల్ మండలం భాగ్యనగర్ సమీ పంలో గల యూటర్న్ వద్ద ఆగారు. అక్కడే తండ్రి కుమారుడు మాట్లాడుతుండగా ఆర్మూర్ వైపు నుంచి అతివేగంగా వచ్చిన కారు వెనుక నుంచి వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రి కుమారుడికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వారిని అంబులెన్స్‌లో జిల్లా కేంద్రంలోని ఏరియాస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించగా ఆత్మారాం అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ప్రమాదంలో బైకు, కారు దెబ్బతిన్నాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఒకరికి మూడేళ్ల జైలు
కాసిపేట: చీటింగ్ కేసులో ఒకరికి మూడేళ్ల జైలుశిక్ష విధిస్తూ బెల్లంపల్లి జ్యూడీషియల్ ఫ్లస్ట్‌క్లాస్ మే జిస్ట్రెట్ ముకేష్ మంగళవారం తీర్పునిచ్చారు. దేవా పూర్ ఎస్సై అంజనేయులు కథనం ప్రకారం..2023 లో కుమురం భీం జిల్లా దహెగాం మండలం కల్వడ ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో కాంట్రాక్టు టీచర్‌గా నాయిని బాపు పనిచేసేవాడు. కాసిపేటమండలం పల్లంగూడ, గోండుగూడ గ్రామాల్లో ప్రజలకు ఆ యుష్మాన్ భారత్ పేరిట కార్డులు ఇప్పిస్తానని నమ్మబలికాడు. మిషన్ ద్వారా వేలుముద్రలు తీసుకుని వారి ఖాతాల్లో నగదును ఆయన ఖాతాలోకి మళ్లించుకున్నాడు. ఈ విషయమై పోలీసుస్టేషన్ పరిధిలో మూడు కేసులు నమోదైంది. మంగళవారం బెల్లంపల్లి కోర్టులో ఏపీపీ అజయ్‌కుమార్ సాక్షులను విచారించి నేరం రుజువు చేశారు. నిందితుడికి మూడేళ్ల జైలుశిక్షతోపాటు కేసుకు రూ.వెయ్యి చొప్పున రూ.3 వేలు జరిమానా విధిస్తూ మేజిస్ట్రెట్ తీర్పుచెప్పారు.
రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్
ఆదిలాబాద్‌టౌన్(జైనథ్): అక్రమంగా ఇసుక రవా ణా చేస్తుండగా రెండు ట్రాక్టర్లను పట్టుకుని సీజ్ చేసినట్లు జైనథ్ సీఐ సాయినాథ్ తెలిపారు. పక్కా సమాచారంతో జైనథ్ మండలంలోని పెన్‌గంగా నది గ్రామ శివారులో ఎస్సై వి.పురుషోత్తం, ఏఎస్సై ఆత్మారాం, సిబ్బందితో కలిసి మంగళవారం తనిఖీ లు చేపట్టినట్లు పేర్కొన్నారు. రెండు ట్రాక్టర్లలో ఇ సుక తరలిస్తుండగా సీజ్‌చేసి స్టేషన్‌కు తరలించిన ట్లు తెలిపారు. డీఎస్పీ జీవన్‌రెడ్డి ఆదేశాల మేరకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment