గ్రామాల శివారులో పులి సంచారం
నెన్నెల: మండలంలోని జోగాపూర్, ఆవుడం, చిత్తాపూర్, పొట్యాల గ్రామాల శివారు అడవుల్లో పులి సంచరిస్తోంది. దీంతో పశువుల కాపరులు, రైతుల్లో భయాందోళన వ్యక్తమవుతోంది. పది రోజులుగా బెల్లంపల్లి డివిజన్‌లోని కన్నాల, తాండూర్, కాసిపేట అడవుల్లో సంచరించిన పులి చర్లపల్లి ఎల్లారం మీదుగా కుశ్నపల్లి రేంజ్ పరిధిలోని రంగపేట, జోగాపూర్ అడవి గుండా ఆవుడం, చిత్తాపూర్, పొట్యాల అడవుల్లోకి ప్రవేశించిందని నీల్వాయి రేంజ్ అధికారి అప్పలకొండ తెలిపారు. మంగళవారం చెన్నూర్ ఎఫ్‌డీఓ సర్వేశ్వర్‌రావు, మంచిర్యాల రేంజ్ అధికారి రత్నాకర్ అటవీ సిబ్బందితో కలిసి చిత్తాపూర్ చెరువు వద్ద పులి పాదముద్రలు గుర్తించినట్లు చెప్పారు. గంగారాం అటవీ గుండా కొత్తూర్ మీదుగా జైపూర్, భీమారం అడవుల్లోకి వెళ్లినట్లు పులి జాడలను గుర్తించామని పేర్కొన్నారు. అటవీ సమీప గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment