● రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి
మంచిర్యాలఅగ్రికల్చర్: రానున్న వేసవికాలంలో సాగు, తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులతో సాగు, తాగునీరు, విద్యుత్ సరఫరా, రైతుభరోసా, యూరియా కొరత, రేషన్ కార్డుల జారీ, రెసిడెన్షియల్ పాఠశాలల సందర్శన అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యూరియా కొరత లేకుండా చూడాలని, వేసవిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రజాపాలనలో రేషన్‌కార్డులకు అందిన దరఖాస్తులను పరిశీలించి అర్హులందరికీ మంజూరు చేయాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ వేసవిలో తాగునీటి సమస్యల లేకుండా కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. అర్హులందరికీ రైతు భరోసా అందేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్, మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీవోలు శ్రీనివాస్‌రావు, హరికృష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment