భైంసాటౌన్: పట్టణంలోని కిసాన్‌గల్లీకి చెందిన జంగమోల్ల రాజేశ్వర్(46) అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు సీఐ జి.గోపినాథ్ తెలిపారు. స్థానికుల కథనం ప్రకారం..మృతుడు రాజేశ్వర్ రాహుల్‌నగర్‌లోని ఓ గురుకుల పాఠశాలలో ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన వాచ్‌మెన్‌గా పనిచేసేవాడు. కొన్నిరోజులుగా ఖాళీగా ఉంటుండగా, ఈ క్రమంలో బుధవారం ఇంట్లో అనుమానాస్పద స్థితి లో మృతి చెంది కనిపించాడు. గమనించిన కుటుంబీకులు ఏరియాస్పత్రికి తరలించారు. సీఐ ఆస్పత్రికి చేరుకుని మృతదేహం పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు దర్యాప్తు చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment