ఓసీపీల్లో పచ్చదనం పెంచాలి
● సింగరేణి అడ్వైజరీ మోహన్‌చంద్ర పర్లైన్
శ్రీరాంపూర్: ిసంగరేణి ఓపెన్‌కాస్ట్ గనులపై పచ్చదనాన్ని పెంచాలని సింగరేణి అడ్వైజరీ (ఎన్విరాన్‌మెంట్ అండ్ ఫారెస్ట్) మోహన్ చంద్ర పర్లైన్ (ఐఎఫ్‌ఎస్) తెలిపారు. బుధవారం సీసీసీలోని సింగరేణి గెస్ట్‌హౌస్‌లో శ్రీరాంపూర్, బెల్లంపల్లి, మందమర్రి ఏరియాల జీఎంలు, ఫారెస్ట్, ఎన్విరాన్‌మెంట్ అధికారులతో ఆయన చర్చించారు. ఏరియాల పరిధిలో ఫారెస్ట్ భూములు, చేపడుతున్న పర్యావరణ పరిరక్షణపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణిలోని ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యతనివ్వాలన్నారు. అనంతరం కంపెనీ పరిధిలోని భూములు అందులో చేసిన ప్లాంటేషన్ వివరాలను తెలుసుకున్నారు. సమావేశంలో శ్రీరాంపూర్,మందమర్రి, బెల్లంపల్లి జీఎంలు ఎం.శ్రీనివాస్, దేవేందర్, నరేందర్, శ్రీరాంపూర్ ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్ట్ అధికారి టి.శ్రీనివాస్, కార్పొరేట్ ఎస్టేట్ అధికారులు, సునీల్ వెంకటాచార్యులు, ఆయా డిపార్టుమెంట్ల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment