ఆదర్శపాయుడు ఛత్రపతి శివాజీ
● బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి ● జిల్లాలో బైక్ ర్యాలీ
మంచిర్యాలరూరల్(హాజీపూర్): యువతకు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆదర్శప్రాయుడని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి అన్నారు. శివాజీ జయంతి సందర్భంగా బుధవారం హాజీపూర్ మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ సేవా సమితి ఆధ్వర్యంలో దొనబండ నుంచి హాజీపూర్ వరకు రాంపూర్ ఆవాస విద్యాలయం విద్యార్థుల ఘోష్ విన్యాసాలు, మోటార్‌సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పోలీసుస్టేషన్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో శివాజీ చిత్రపటానికి పూలమాల వేస్తుండగా మంచిర్యాల రూరల్ సీఐ ఆకుల అశోక్, పోలీసు సిబ్బంది అడ్డుకున్నారు. ఈ క్రమంలో కొద్దిసేపు పోలీసులు, నాయకులు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పోలీసుల తీరుపై రఘునాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శివాజీ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేస్తే 21మందిపై కేసులు పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఉగాది వరకు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో శివాజీ సేవా సమితి సభ్యులు స్వామిరెడ్డి, మోటపలుకుల తిరుపతి, బొలిశెట్టి అశ్విన్‌రెడ్డి, బేతు రవి, జూపాక ధర్మయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు.
లక్సెట్టిపేటలో..
లక్సెట్టిపేట: స్థానిక బస్డాండ్ నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు రఘునాథ్ ఆధ్వర్యంలో బుధవారం మోటార్‌సైకిల్ ర్యాలీ నిర్వహించారు. మండల నాయకులు ప్రభాకర్, దిలీప్, ఉమేష్, వెంకటేష్, హ రీష్, రాజయ్య, గురువయ్య, సంతోష్, సురందర్, హరిగోపాల్, హేమంత్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment