ఆసుపత్రుల్లో వైద్య సేవల పరిశీలన
మంచిర్యాలటౌన్/జన్నారం: జిల్లాలోని ప్రభు త్వ ఆసుపత్రుల్లో అందిస్తున్న వైద్య సేవలను పాపులేషన్ రీసెర్చ్ సెంటర్(పీఆర్సీ) విశాఖపట్టణం బృందం రెండో రోజు బుధవారం పరిశీ లించింది. మంచిర్యాల మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో గర్భిణుల ప్రసవాలు, బాలింతలకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. చి న్నారుల కోసం ఏర్పాటు చేసిన ఎన్‌ఐసీయూ వార్డును సందర్శించి వైద్య సేవలతోపాటు అ న్ని రకాల వైద్య పరికరాలు, మౌలిక వసతులు పరిశీలించారు. చిన్నారులకు వేసే వ్యాక్సిన్ల ల భ్యత, సరైన సమయాల్లో వేస్తున్న వ్యాక్సిన్లను పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. అనంతరం జిల్లాలోని ఇందన్‌పల్లి సబ్ సెంట ర్, జన్నారం పీహెచ్‌సీ, హాజీపూర్ పీహెచ్‌సీ, లక్సెట్టిపేట పీహెచ్‌సీ, దొనబండ సబ్‌సెంటర్ల ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వై ద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ హరీశ్‌రాజ్, మంచిర్యాల ఉప జిల్లా వైద్యాధికారి డాక్టర్ అని త, ఆర్‌ఎంవో డాక్టర్ భీష్మ, హెచ్‌వోడీ డాక్టర్ వేదవ్యాస్, డాక్టర్ పవన్, ఎంసీహెచ్ పీవో డాక్టర్ కృపాబాయి, పీఆర్సీ వైద్యులు, రీసెర్చ్ సైంటిస్టులు డాక్టర్ రమణ, డాక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment