పెండింగ్ బిల్లులు ఇప్పించండి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): జిల్లాలోని పంచాయతీలకు పెండింగ్‌లో ఉన్న బిల్లులు వెంటనే ఇప్పించాలని జిల్లా పంచాయతీ కార్యదర్శులు కలెక్టర్ కుమార్‌దీపక్, డీపీఓ వెంకటేశ్వర్‌రావును కోరారు. ఈ మేరకు బుధవారం జిల్లా పంచాయతీ కార్యదర్శుల ఫోరం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. పెట్రోల్‌బంక్‌ల్లో పంచాయతీ ట్రాక్టర్లకు డీజీల్ పోయడం లేదని, ఆగస్టు నుంచి చెక్కులు పెండింగ్‌లోనే ఉండడం వల్ల ఆర్థిక భారాన్ని తాము మోయలేమని పేర్కొన్నారు. మార్చి నెల నుంచి ఖర్చులు భరించే స్థితిలో లేమని తేల్చిచెప్పినట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు శ్రావణ్‌కుమార్, సంయుక్త కార్యదర్శి చంద్రమౌళి, జిల్లా అధ్యక్షుడు పూదరి నరేందర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, అసోసియేట్ అధ్యక్షుడు నాగరాజు, తాజొద్దీన్, శ్రీనివాస్, కోశాధికారి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు సుమన్, వరప్రసాద్, క్రాంతి, సంయుక్త కార్యదర్శి దివాకర్, కార్యాలయ కార్యదర్శి రమణ, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment