మంచిర్యాలటౌన్: జిల్లా కేంద్రంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. లక్ష్మీ టాకీస్ చౌరస్తా వద్ద శివాజీ విగ్రహ స్థాపన కమిటీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి మాట్లాడుతూ మంచిర్యాలలో ఛత్రపతి శివాజీ విగ్రహం స్థాపనకు ఐదేళ్లుగా కలెక్టర్, అధికారులు అనుమతి ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని అన్నారు. విగ్రహ స్థాపనకు అనుమతి ఇచ్చి, లక్ష్మీ టాకీస్ చౌరస్తాకు శివాజీ చౌక్‌గా నామకరణం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కర్ణకంటి రవీందర్, బోయిని హరికృష్ణ, కిరణ్, మున్నారాజా సిసోడియా, పెద్దపల్లి పురుషోత్తం, ఆకుల అశోక్‌వర్దన్, మోటూరి కిరణ్, వంగపల్లి వెంకటేశ్వర్, అమిరిశెట్టి రాజ్‌కుమార్, చిరంజీవి, బెల్లంకొండ మురళి పాల్గొన్నారు. జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో కుమురంభీం సేవా సమితి, ఫిట్‌నెస్ సెంటర్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment