జిల్లాలో పత్తి కొనుగోళ్లు చేపట్టాలి
చెన్నూర్: జిల్లాలో సర్వర్ సమస్యతో పది రోజులకు పైగా పత్తి కొనుగోళ్లు నిలిచిపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారని, సర్వర్‌తో పని లేకుండా మాన్యువల్‌గా కొనుగోళ్లు చేపట్టాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్‌వెంకటస్వామి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కోరారు. బుధవారం ఆయనను కలిసి వినతిపత్రం అందజేయడంతో రైతుల సమస్యలను వివరించారు. కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్‌ను సంప్రదించారని తెలిపారు. ఆయన సీసీఐ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ లలిత్‌కుమార్‌తో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారని పేర్కొన్నారు. జిల్లా రైతులు ఆందోళన చెందవద్దని, త్వరలోనే కొనుగోళ్లు ప్రారంభమవుతాయని ఎంపీ, ఎమ్మెల్యేలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment