బెల్లంపల్లి: అవసరమైన సహాయ ఉపకరణాలు పొందడానికి నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరాలను దివ్యాంగులు స ద్వినియోగం చేసుకోవాలని జిల్లా అ డిషనల్ కలెక్టర్ మోతిలాల్ అన్నారు. బుధవారం బెల్లంపల్లి సింగరేణి కళా వేదికలో మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సంయు క్త ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శారీరక, మానసిక ది వ్యాంగులకు సహాయ ఉపకరణాలు అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం అలీమ్‌కో సంస్థ సిబ్బంది దివ్యాంగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీ క్షల ఆఽ దారంగా సహాయ ఉపకరణాలు అందిస్తామని ప్రకటించారు. బెల్లంపల్లి, తాండూర్, కాసిపేట, నెన్నెల, భీమిని మండలాల నుంచి దివ్యాంగులు తరలి వచ్చారు. జిల్లా సంక్షేమ అధికారి రవూఫ్‌ఖాన్, ఆర్డీవో హరికృష్ణ, సీడీపీవో స్వరూపరాణి, ఎంపీడీవోలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment